ఇండస్ట్రీలో ఒక లెవల్ కి వెళ్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ సినీ జీవితం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అని చెప్పవచ్చు.. అక్కడితో ఆగకుండా ఆయన మరణం వరకు వెళ్ళింది. ఉదయ్ కిరణ్ తేజ దర్శకత్వంలో మొదటిసారి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. చిత్రం సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయింది.. ఈ మూవీ థియేటర్లో దాదాపుగా 100 రోజులకు పైగానే ఆడింది అని చెప్పవచ్చు.. ఈ మూవీ తర్వాత ఉదయ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా నువ్వు నేను..ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.. దీంతో ఒక్కసారిగా ఉదయ్ కిరణ్ పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోయింది.
వరుసగా సినీ ఆఫర్లు రావడంతో తన కెరీర్ సక్సెస్ఫుల్ బాట లో నడుస్తున్న సమయంలో ఉదయ్ కిరణ్ జీవితంలో ఒక్క సారిగా అలజడి మొదలైంది. మెగాస్టార్ ఫ్యామిలీ తో ఉదయ్ కిరణ్ కి వివాదం మొదలైంది.. దీంతో పవన్ కళ్యాణ్ మరియు ఉదయ్ కిరణ్ మధ్య చాలా వార్ నడిచిందని ఆ మధ్య కాలంలో ప్రచారం కూడా జరిగింది. అది నిజమో అబద్దమో ఇప్పటికి తెలియదు కానీ ఈ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లో ఉదయ్ కిరణ్ జీవితం అర్థంతరంగా ముగిసిపోయింది. ఆత్మహత్య చేసుకుని మరణించారు.. అప్పట్లో ఉదయ్ కిరణ్ చావుకు చిరంజీవి కుటుంబమే కారణమని పుకార్లు కూడా వచ్చాయి. కానీ దీనిపై మెగాస్టార్ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి స్పందన లేదు.. అయితే మెగాస్టార్ ను దగ్గర్నుంచి చూసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు ఈ విషయంపై స్పందించారు.
ఉదయ్ కిరణ్ కి ఆఫర్స్ తగ్గిన విషయం వాస్తవమే కాని దాని వెనుక చిరంజీవి లేరని సమాధానమిచ్చారు. చిరంజీవి ఒక తండ్రిలా తన కూతురిని జీవితాంతం బాగా చూసుకునే వ్యక్తితో వివాహం చేయాలనుకున్నాడు. కానీ దానికి ఉదయ్ కిరణ్ రేంజ్ వారి కుటుంబానికి సరిపోదని పెళ్లిని వద్దనుకున్నారు.. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే ఒక సంవత్సరంలోనే బయటపడేది. ఈ విధంగా ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవిని నిందించడం కరెక్టు కాదని సీనియర్ జర్నలిస్ట్ చెప్పుకొచ్చారు.. కానీ ఉదయ్ కిరణ్ మృతి మాత్రం ఇప్పటికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.