వినోదం

Jr NTR : నెగెటివ్ టాక్ తెచ్చుకొని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ చిత్రం ఏదో తెలుసా..?

Jr NTR : సినిమాకి మొద‌టి రోజు మొద‌టి ఆట వ‌చ్చే రెస్పాన్స్ చాలా ఇంపార్టెంట్‌. ఫ‌స్ట్ టాక్ ని బ‌ట్టే సినిమా హిట్టా ఫ‌ట్టా అనేది డిసైడ్ చేస్తుంటారు. ప్రేక్ష‌కులు కూడా ఫ‌స్ట్ షో రోజు ఎలాంటి రెస్పాన్స్ వ‌చ్చిందో తెలుసుకొని థియేట‌ర్స్ కి వెళుతుంటారు. అయితే ఒక‌సారి ఒక సినిమాకి తొలుత నెగెటివ్ టాక్ వ‌చ్చిన త‌రువాత అది క్ర‌మ‌క్ర‌మంగా పాజిటివ్‌గా మారి సూప‌ర్ హిట్ అవుతుంది. ఆ క్ర‌మంలో హిట్ అయిన చిత్రం నాన్న‌కు ప్రేమ‌తో. నాన్నకు ప్రేమతో సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం కాగా, ఇందులో జూనియర్ ఎన్ టి ఆర్, రకుల్ ప్రిత్‌ సింగ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సితార, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్, రాజివ్ కనకాల, తాగుబోతు రమేష్, మధుబాల తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు.

ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ నిర్వహించారు మరియు నిర్మాత బి వి ఎన్ ఎస్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు. ఇందులో ఎన్టీఆర్ లుక్‌ కు అభిమానులు అంతా ఫిదా అయ్యారు.ఎన్టీఆర్ లుక్ సూపర్ అంటూ ఆ సమయంలో ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు. తీరా సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు కూడా పెదవి విరిచారు. సుకుమార్ పెద్ద లెక్కల మాస్టర్ కాబ‌ట్టి ఆయ‌న కాలిక్యులేష‌న్స్ ను వెంట‌నే రిసీవ్ చేసుకోలేక‌పోయారు.

this jr ntr movie got negative talk first

సుకుమార్ స్థాయిలో ఆలోచించడం అప్పటి ప్రేక్షకుల వల్ల కాలేదు.అందుకే నాన్న కు ప్రేమతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేదు అంటారు విశ్లేషకులు. అయితే మొద‌టి రోజు నెగెటివ్ టాక్ వ‌చ్చిన ఈ చిత్రం త‌ర్వాత త‌ర్వాత పుంజుకుంది. 54 కోట్ల షేర్ రాబ‌ట్టి అద్భుత‌మైన విజ‌యం సాధించింది. సుకుమార్ స్థాయి ఏంటి అనేది ఆ సినిమా నిరూపించింది.సుకుమార్ ఒక మంచి దర్శకుడు అనడంలో ఎలాంటి డౌట్ లేదు అని ఆ సినిమా మరోసారి నిరూపించింది. ఈ సినిమా ఇప్ప‌ట్లో వ‌చ్చి ఉంటే మ‌రింత సూప‌ర్ హిట్ అయి ఉండేద‌ని అంటున్నారు.

Admin

Recent Posts