తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల క్రితం యంగ్ హీరో ఉదయ్ కిరణ్ కొన్ని రికార్డులే క్రియేట్ చేశారు. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన సినిమాలతో ఎంతోమంది అమ్మాయిల కలల రాకుమారుడిగా మారారు. లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన కొంతకాలం తర్వాత అనేక ఇబ్బందులు పడి చివరికి తన ప్రాణాలు కూడా కోల్పోయాడు . అలాంటి ఉదయ్ కిరణ్ నువ్వు నేను, చిత్రం,మనసంతా నువ్వే అనే చిత్రంలో నటించారు. ఆ టైంలో స్టార్ హీరోలు అయిన చిరంజీవి, వెంకటేష్ వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఇక చిరంజీవికి మృగరాజు, డాడీ, మంజునాథ లాంటి సినిమాలు వరుసగా వచ్చాయి.
మరోవైపు వెంకటేష్ దేవి పుత్రుడు, ప్రేమతో రా లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ తరుణంలో ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే అనే సినిమాను 2001 సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. నిర్మాత ఎమ్మెస్ రాజు అయితే నువ్వు నాకు నచ్చావ్ సినిమా సెప్టెంబర్ 6న విడుదలవుతుందని మనసంతా నువ్వే రెండు వారాలు వెనక్కి జరపాలని ఆ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజును అడిగారట. దీనికి రాజు ఒప్పుకొని సెప్టెంబర్ 20 లేదా 27న తన సినిమా రిలీజ్ చేస్తారని చెప్పారు అట. అయితే చిరు డాడీ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ అవుతుంది.
ఉదయ్ కిరణ్ సినిమా హిట్ అయితే డాడీ సినిమాకి ఇబ్బంది అవుతుందని భావించి డాడీ రిలీజ్ అయిన రెండు వారాల తర్వాత మనసంతా నువ్వే రిలీజ్ చేయాలని కోరగా ఎమ్మెస్ రాజు ఒప్పుకున్నారట. చివరికి నువ్వు నాకు నచ్చావ్, డాడీ రెండు సినిమాల కంటే ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే చిత్రం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా వసూళ్లపరంగా కూడా దూసుకుపోయిందట. అప్పట్లో ఉదయ్ కిరణ్ క్రేజ్ చూసిన టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా భయపడినట్టు తెలుస్తోంది.