వినోదం

Deeksha Seth : వేదం, మిరపకాయ్ సినిమాల్లో నటించిన దీక్షాసేథ్ ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా..?

Deeksha Seth : ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు దశాబ్దాలుగా కొనసాగుతుంటారు కానీ హీరోయిన్స్ మాత్రం మూడుపదుల వయసులోకి అడుగు పెట్టగానే తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే. అదృష్టం బాగుంటే ఇంకో ఐదేళ్లు అంతే.. మరికొందరైతే ఒకటి, రెండు సినిమాలతోనే ఇలా వచ్చి అలా పోతుంటారు. అందం, అభిన‌యం ఉన్న‌ప్ప‌టికీ కొంత‌మందికి అదృష్టం మాత్రం అచ్చిరాదు. అలాంటి హీరోయిన్‌ల‌లో దీక్షాసేథ్ ఒక‌రు అని చెప్పాలి. దీక్షా సేథ్ అనగానే ఈ హీరోయిన్ ఎవరు అనుకోవచ్చు.. కానీ, వేదం, రెబల్, మిరపకాయ్, వాంటెడ్ సినిమా హీరోయిన్ అనగానే టక్కున ఓ ఆ హీరోయినా అని అనేస్తారు.

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ వేదం సినిమా తరువాత సెకండ్ హీరోయిన్ గా మిరపకాయ్, రెబల్ చిత్రాల్లో దర్శనమిచ్చింది. ఇక ఈ సినిమాలు అమ్మడికి అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. తరువాత హీరోయిన్ గా వాంటెడ్, నిప్పు, ఊ కొడతావా.. ఉలిక్కి పడతావా లాంటి సినిమాలు చేసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో టాలీవుడ్ కు నిదానంగా దూరమైంది. 2014లో లేక‌ర్ హ‌మ్ దివానా దిల్ అనే చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

what deeksha seth is doing now and how is she

ఆ త‌రువాత వ‌చ్చిన జ‌గ్గు దాదా సినిమాతో క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది హిందీలో మ‌రొక సినిమాలో కూడా న‌టించింది. కానీ ఆ సినిమాలు దీక్షా కెరీర్ కు అంత‌గా ఉప‌యోగ‌ప‌డలేదు. ఈ సినిమాల త‌రువాత దీక్షాసేథ్ ఏ సినిమాలోనూ న‌టించ‌లేదు. ప్ర‌స్తుతం ఈమె ఏం చేస్తుందో ఎవ‌రికీ తెలియ‌దు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో దీక్షా గురించి చ‌ర్చ మొద‌లైంది. ఈమె ఎక్క‌డ ఉందో అని ఆరా తీస్తున్నారు. సినిమాలు వ‌దిలేసినా కానీ అభిమానుల‌కు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండి ఉంటే దీక్షాసేథ్‌కు కాస్త గుర్తింపు ఉండేదేమో అంటున్నారు నెటిజన్లు.

Admin

Recent Posts