వినోదం

రాజమౌళి అమ్మ గారు చిరంజీవికి బంధువా ? ఎలాగంటే ?

ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో కష్టపడి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా మారారు. ఐదు దశాబ్దాల అతని సినీ ప్రస్థానంలో ఎన్నో సినిమాలు చేసి మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్నారు. అలా ఒక పది సంవత్సరాలు గ్యాప్ తీసుకుని చిరంజీవి మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినా ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉండగా, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన మంచి రైటర్ అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు. అందులో ఆయన భార్య గురించి, ఆమెకి చిరంజీవి కుటుంబానికి ఉన్న నేపథ్యం గురించి చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా రాజమౌళి లానే ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన కమ్మ వర్గానికి చెందినవారు, అతని భార్య రాజ నందిని కాపు వర్గానికి చెందిన మహిళ. అయితే ఈ విషయం ఆయనకి పెళ్లి అయిన‌ చాలా రోజుల వరకు తెలియదట.

what is the relation between rajamouli mother and chianjeevi

‘ఖైదీ’ సినిమా సూపర్ హిట్ అయినా టైం లో ఆవిడ ‘మా చిరంజీవి, మా చిరంజీవి అదరగొట్టేశాడు’ అంటూ అనడంతో, ఆయన మీకు ఏమైనా బంధువా అని విజయేంద్ర ప్రసాద్ గారు అడిగారట. దానికి ఆమె కాదు, ‘చిరంజీవి కూడా మా వాళ్లే’ అంటూ సమాధానం ఇచ్చిందట. ఆమె చిరంజీవికి పెద్ద ఫ్యాన్ అని, తన కుటుంబంలో చాలామంది ప్రేమ వివాహం అది కూడా కులాంతర వివాహం చేసుకున్నారని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.

Admin

Recent Posts