టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ ఎంతమంది అభిమానులను సొంతం చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో తొందరగా ఉదయించిన ఈ ఉదయం సూర్యుడు.. అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది మదిని గెలిచి చాలా తొందరగా అస్తమించారు. 1980 జూన్ 26న హైదరాబాద్ లో జన్మించారు ఉదయ్ కిరణ్. 2000 సంవత్సరంలో చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. కొద్ది సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు.
అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కూతురు సుష్మితతో ఉదయ్ కిరణ్ ఎంగేజ్మెంట్ జరగడం.. ఆ తర్వాత అది క్యాన్సిల్ అవడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ఉదయ్ కిరణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన విషితని ప్రేమించి 2012లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలు ఫ్లాప్ కావడం, ఆర్థిక సమస్యల వల్ల ఒత్తిడికి గురైన ఉదయ్ కిరణ్ 2014లో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన తర్వాత అతని భార్య ఎక్కడ ఉంది? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయాలు చాలా మందికి తెలియదు. విషిత పెళ్లికి ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేది. పెళ్లి తర్వాత కూడా తన జాబ్ కంటిన్యూ చేసింది. జాబ్ చేస్తూనే ఉదయ్ కిరణ్ కి మోరల్ గాను సపోర్ట్ చేసింది విషిత.
అయితే ఉదయ్ కిరణ్ మరణం తర్వాత ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా గడుపుతుంది విశిత. ప్రేమించిన భర్త దూరం కావడంతో కుమిలిపోయిన విశిత ఈ జీవితాన్ని ఆయనకే అంకితం చేశారు. ప్రస్తుతం ఆమె ఫేస్బుక్ లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు సమాచారం. తనకు వచ్చిన సంపాదనతో అటు కుటుంబాన్ని పోషిస్తూ, ఇటు ఉదయ్ కిరణ్ పేరు మీద ఉన్న ఎన్జీవోలకు విరాళాలు ఇస్తూ ఉంటారు. చిన్న వయసులోనే భర్త చనిపోయినప్పటికి మరొక పెళ్లి చేసుకోకుండా విషిత సింగల్ గా ఉండిపోవడం అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజానికి ఈ రోజుల్లో ఇలా ఉండడం గొప్ప విషయమనే చెప్పాలి.