వైద్య విజ్ఞానం

మ‌ద్యం సేవించి నిద్రిస్తే మీ శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా..?

మద్యం సేవిస్తే దాని వ‌ల్ల ఎవ‌రికైనా మ‌త్తు వస్తుంది. బీర్‌, బ్రాందీ, విస్కీ, వోడ్కా, వైన్‌… ఇలా ఏ త‌ర‌హా మ‌ద్యం తాగినా ఎవ‌రికైనా మ‌త్తు వ‌స్తుంది. కాక‌పోతే ఒక్కో వ్య‌క్తి కెపాసిటీని బ‌ట్టి మ‌త్తును త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగే సామ‌ర్థ్యం ఉంటుంది. అది వేరే విష‌యం. అయితే ఎవ‌రు మ‌ద్యం తాగినా చేసే ప‌ని వెంట‌నే నిద్రించ‌డం. కొంద‌రైతే కేవ‌లం హాయిగా నిద్రించ‌డం కోస‌మే రిలాక్సేష‌న్ కోసం మందు తాగుతారు. అది నిజ‌మే… మందు తాగితే రిలాక్సేష‌న్ వ‌స్తుంది, మ‌త్తుతో నిద్ర త్వ‌ర‌గా ప‌డుతుంది. హాయిగా ప‌డుకోవ‌చ్చు కూడా. కానీ మ‌ద్యం సేవించి అలా ప‌డుకుంటే అప్పుడు మ‌న శ‌రీరంలో ఏం జ‌రుగుతుందో తెలుసా.? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ద్యం సేవించి ప‌డుకుంటే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి పెరుగుతాయి. అప్ప‌టిక‌ప్పుడు అవి క‌నిపించ‌క‌పోయినా ప‌డుకుని లేచాక అవి వెంట‌నే వ‌చ్చేస్తాయి. ఆ స‌మ‌యంలో చాలా ఒత్తిడి, ఆందోళ‌న‌, కంగారు వంటివి ఉంటాయి. దీంతో అది మాన‌సిక ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంది.

సాధార‌ణంగా మ‌నం నిద్రిస్తే మ‌న మెద‌డు ఆ రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను నిద్ర‌లో 5 నుంచి 7 సార్లు గుర్తు చేసుకుంటుంది. ఇది ఆటోమేటిక్ గా జ‌రిగే ప్ర‌క్రియ‌. అయితే మ‌ద్యం సేవించి ప‌డుకుంటే అప్పుడు మెదడుకు ప‌ని త‌గ్గుతుంది. దీంతో ఆ రోజు సంఘ‌ట‌న‌లను కేవ‌లం 1 నుంచి 2 సార్లు మాత్ర‌మే గుర్తు చేసుకుంటుంది. దీని వల్ల మ‌న‌కు ఎలాంటి స‌మ‌స్యా లేక‌పోయినా, ఏవైనా ముఖ్య‌మైన సంఘ‌ట‌న‌లు జ‌రిగితే వాటిని మ‌నం మ‌రిచిపోతాం. గుర్తు పెట్టుకునేందుకు చాన్స్ ఉండ‌దు. మెమొరీ ప‌వ‌ర్ త‌గ్గుతుంది. మ‌ద్యం సేవించి ప‌డుకునే వారిలో గుర‌క స‌మ‌స్య వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అది కూడా చాలా పెద్ద‌గా గుర‌క వ‌స్తుంది. అది గ‌న‌క ఒక‌సారి వ‌స్తే అప్పుడు అస్స‌లు పోదు.

what happens if you drink liquor and sleep

మ‌ద్యం సేవించి ప‌డుకుంటే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా వేగంగా జ‌రుగుతుంది. తద్వారా బీపీ పెరుగుతుంది. ఫ‌లితంగా అది గుండె స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తుంది. మ‌ద్యం సేవించి నిద్రిస్తే శ‌రీరంలో ఉన్న ఆ విష ప‌దార్థాన్ని బ‌య‌ట‌కు వెళ్ల‌గొట్టేందుకు లివ‌ర్ ఎక్కువ‌గా ప‌నిచేస్తుంది. దీంతో కిడ్నీలు త్వ‌ర త్వ‌ర‌గా దాన్ని బ‌య‌ట‌కు పంపుతాయి. అప్పుడు ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో కిడ్నీలు, లివ‌ర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. మ‌ద్యం సేవించి ప‌డుకున్న వారికి విప‌రీతంగా చెమ‌ట పోస్తుంది. అయితే దాని ఎఫెక్ట్ అప్పుడే ఉండ‌దు. మ‌రుస‌టి రోజు ఉంటుంది. ఆ రోజంతా శ‌రీరం డీహైడ్రేష‌న్‌కు గుర‌వుతుంది.

Admin

Recent Posts