వినోదం

Uday Kiran : ఉద‌య్ కిర‌ణ్‌తో చిరంజీవి కూతురి పెళ్లి క్యాన్సిల్ కావ‌డానికి కార‌ణ‌మేంటి ?

Uday Kiran : సినిమా ప‌రిశ్ర‌మ‌లో సెల‌బ్రిటీల‌కు సంబంధించి ఎన్నో వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి. ఇందులో ఏది నిజ‌మో, ఏది అబ‌ద్ధ‌మో తెలియ‌క అభిమానులు అయోమ‌యానికి గుర‌వుతుంటారు. కొన్ని సార్లు అబద్ధాల‌ని కూడా నిజ‌మ‌ని న‌మ్మేస్తుంటారు. ఈ క్రమంలో ఎవ‌రో ఒక‌రు వాటిపై క్లారిటీ ఇస్తే కానీ ఆ పుకార్ల‌కు చెక్ ప‌డ‌దు. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోగా పరిచయం అయి ఆ త‌ర్వాత మెల్ల‌మెల్ల‌గా సూప‌ర్ హిట్స్ సాధించి స్టార్ హీరోగా ఎదిగాడు ఉద‌య్ కిర‌ణ్‌. ల‌వ‌ర్ బాయ్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉద‌య్ కిర‌ణ్ 2014 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

ఉదయ్ కిరణ్ మృతికి కారణం చిరంజీవి అని పలువురు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అయితే దీనిపై మెగాస్టార్ ను దగ్గర నుంచి చూసిన ఓ సీనియర్ జర్నలిస్టు స్పందించారు. ఉద‌య్ కిర‌ణ్‌కు ఆఫ‌ర్లు త‌గ్గిన మాట వాస్త‌వ‌మే అయిన‌ప్ప‌టికీ దానికి వెనుక చిరంజీవి లేరు. చిరంజీవి ఒక‌రికి త‌న వంతు సాయం చేస్తారే త‌ప్ప అన్యాయం చేయ‌రు. ఉద‌య్ కిర‌ణ్ స్థానం, కుటుంబ నేప‌థ్యం చిరంజీవికి స‌రిపోక‌పోవ‌డం వ‌ల్ల‌నే చిరంజీవి ఉద‌య్ కిర‌ణ్‌ని త‌న ఇంటి అల్లుడిగా చేసుకోవ‌డానికి ఒప్పుకోలేదు.

why chiranjeevi cancelled his daughter marriage with uday kiran

చిరంజీవితో ఉదయ్ కిరణ్ కు సమస్యలు ఉంటే పెళ్లి జరిగిన ఏడాదిలోపే ఆ విషయాలు బయటకు వచ్చేవి. కానీ అవేమి బయ‌ట‌కు రాలేదు. ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణం విష‌యంలో చిరుని నిందించ‌డం స‌రికాదు అని స‌ద‌రు జ‌ర్న‌లిస్ట్ స్ప‌ష్టం చేశారు. కాగా ఉదయ్ కిరణ్ కి ఒక గాడ్ ఫాదర్ లాగా చిరంజీవి ఉండేవార‌ట‌. మొదట్లో తన సినిమాలన్నీ కూడా హిట్ అవుతుంటే చిరంజీవి ఎంతగానో ప్రోత్సహించేవారు. అప్పుడప్పుడు కొన్ని తప్పుడు ఛాయిస్‌ల వల్ల వరుస ఫ్లాపులను ఎదుర్కున్నాడు. ఉదయ్ కిరణ్ చివరి సినిమా చిత్రం చెప్పిన కథ అనే విష‌యం తెలిసిందే.

Admin

Recent Posts