Treadmill Running Benefits : ప్రస్తుత తరుణంలో చాలా మంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. రోజూ వేళకు నిద్రించడం, తగిన పౌష్టికాహారం తీసుకోవడం చేస్తున్నారు. అలాగే వ్యాయామం కూడా చేస్తున్నారు. అయితే వ్యాయామం విషయానికి వస్తే వాకింగ్ చేయడం అనేది చాలా సులభతరమైన ఎక్సర్‌సైజ్ అని చెప్పవచ్చు. ఏ వయస్సు వారైనా సరే ఎప్పుడైనా సరే వాకింగ్ చేయవచ్చు. కానీ కొందరికి వాకింగ్ చేసేందుకు సరైన స్థలం ఉండదు. అలాగే వర్షాకాలంలో బయట వాకింగ్ చేయలేరు. ఇలా కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. కానీ అలాంటివారు ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేయవచ్చు. అలాగే దీనిపై రన్నింగ్ కూడా చేయవచ్చు.
మొదట్లో కష్టంగా ఉంటుంది కనుక నెమ్మదిగా వాకింగ్ చేయాలి. కాస్త అలవాటు కాగానే ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్ చేయాలి. ఇలా రోజూ కనీసం 15 నిమిషాల పాటు చేసినా చాలు.. అనేక ప్రయోజనాలను పొందవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ ట్రెడ్‌మిల్ పై రన్నింగ్ చేయడం వల్ల గుండెకు ఎంతగానో మేలు జరుగుతుంది. ముఖ్యంగా శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా ఉంటుంది. అలాగే గుండె పనితీరు మెరుగు పడుతుంది. గుండె జబ్బులు రావు. అలాగే ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేయడం వల్ల శరీరంలోని కొవ్వు వేగంగా కరుగుతుంది. బరువు తగ్గుతారు. బరువు తగ్గాలని చూస్తున్నవారు ట్రెడ్ మిల్‌పై రోజూ రన్నింగ్ చేయడం వల్ల ఎంతగానో ఫలితం ఉంటుంది. త్వరగా గోల్ ను చేరుకోవచ్చు.
ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. నిద్ర చక్కగా పడుతుంది. ఇలా రన్నింగ్ చేయడం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే శరీర శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎముకలు దృఢంగా మారుతాయి. వృద్ధాప్యంలో ఎముకల సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా రోజూ ట్రెడ్ మిల్‌పై రన్నింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.