food

Masala Egg Fry : ఘుమ ఘుమ‌లాడే మ‌సాలా ఎగ్ ఫ్రై.. ఇలా చేయండి.. టేస్ట్ అదిరిపోతుంది..!

Masala Egg Fry : కోడిగుడ్ల‌తో చేసే ఏ వంట‌కాన్న‌యినా చాలా మంది ఇష్టంగానే తింటారు. కోడిగుడ్ల‌తో మ‌నం అనేక ర‌కాల వంట‌లను చేసుకుని తిన‌వ‌చ్చు. వాటిల్లో ఒక‌టి మ‌సాలా ఎగ్ ఫ్రై. కోడిగుడ్ల‌ను ఉడ‌కబెట్టి, మసాలా వేసి వండుకుని తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. మరి మ‌సాలా ఎగ్ ఫ్రై ఎలా త‌యారు చేయాలో, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడ‌క‌బెట్టిన కోడి గుడ్లు – 4, ఉల్లిపాయలు – 1 కప్పు, టమాటాలు – 1 కప్పు, స్ప్రింగ్‌ ఆనియన్స్ – 1 కప్పు, పచ్చిమిర్చి – 5, కారం – అర టీస్పూన్‌, జీలకర్ర – అర టీస్పూన్‌, ధనియాల పొడి – అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు – 4, ఉప్పు – రుచికి సరిపడా, నూనె – తగినంత.

masala egg fry recipe very tasty

తయారీ విధానం..

టమాటాలు, వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని క‌ట్ చేసి వాటిలో నీరు పోసి వాటిని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసి ప‌క్క‌న పెట్టాలి. పాత్ర‌లో నూనె పోసి వేడి చేసి అందులో స‌న్న‌గా క‌ట్ చేసిన ప‌చ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు వేసి బాగా ఫ్రై చేయాలి. అనంత‌రం ముందుగా ప‌ట్టుకున్న ట‌మాటా, వెల్లుల్లి పేస్ట్‌ను వేయాలి. వాస‌న పోయే వ‌ర‌కు మిశ్ర‌మాన్ని ఫ్రై చేయాలి.

అనంత‌రం అందులో ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి వేసి బాగా క‌లిపి ఫ్రై చేయాలి. మొత్తం మిశ్ర‌మం బాగా ఫ్రై అయ్యాక అందులో ముందుగా ఉడికించి క‌ట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్క‌ల‌ను వేసి మ‌ళ్లీ ఫ్రై చేయాలి. త‌రువాత ఉప్పు వేసి, చివ‌రిగా కొత్తిమీర త‌రుగును అలంక‌రించాలి. దీంతో ఘుమ ఘుమ‌లాడే మ‌సాలా ఎగ్ ఫ్రై త‌యార‌వుతుంది. దీన్ని చ‌పాతీలు లేదా అన్నంతో తిన‌వ‌చ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. అంద‌రూ ఇష్టంగా తింటారు.

Admin

Recent Posts