Camphor : క‌ర్పూరాన్ని ఉప‌యోగించి ఎన్ని అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

Camphor : మ‌నం దేవుడి పూజ‌లో ఉప‌యోగించే వాటిల్లో క‌ర్పూరం ఒక‌టి. ఇది మైనంలా తెల్ల‌గా పార‌ద‌ర్శ‌కంగా ఉంటుంది. అలాగే చ‌క్క‌టి వాస‌న‌ను కూడా క‌లిగి ఉంటుంది. దేవుడికి హార‌తిని ఇవ్వ‌డానికి దీనిని మ‌నం ఎక్కువ‌గా ఉప‌యోగిస్తాం. క‌ర్పూరం అన‌గానే హార‌తి ఇచ్చే క‌ర్పూర‌మే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. తెల్ల క‌ర్పూరం, ప‌చ్చ క‌ర్పూరం అనే రెండు ర‌కాలు ప్ర‌సిద్ధి చెందాయి. కానీ క‌ర్పూరంలో 15 ర‌కాలు ఉన్నాయి. దేవుడికి హార‌తి ఇచ్చేందుకే కాదు క‌ర్పూరాన్ని ఔష‌ధంగానూ ఉప‌యోగిస్తారు. ఆయుర్వేదంలో క‌ర్పూరానికి విశిష్ట స్థానం ఉంది. క‌ర్పూరంలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. క‌ర్పూరాన్ని నీటిలో క‌లుపుకుని తాగితే నీళ్లు శుభ్ర‌ప‌డ‌తాయ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గుండె స‌మ‌స్య‌ల‌కు, అల‌స‌ట‌కు కొద్ది మొత్తంలో క‌ర్పూరం వాడితే ఫ‌లితం ఉంటుంది. అన్నీ ర‌కాల ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య‌ల‌ను, రుమాటిక్ నొప్పుల‌ను, న‌డుము నొప్పిని, న‌రాల సంబంధించిన నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో క‌ర్పూరం చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. పుండ్లు మాన‌డానికి , గ‌జ్జి, తామ‌ర వంటి ఇన్ ఫెక్ష‌న్ ల‌ను తగ్గించ‌డానికి కూడా క‌ర్పూరాన్ని ఉప‌యోగిస్తారు. యాంటీ సెప్టిక్ గా కూడా క‌ర్పూరం ఉప‌యోగ‌ప‌డుతుంది. నాసిక స‌మ‌స్య‌ల‌ను కూడా క‌ర్పూరాన్ని వాడ‌తారు. అందుకే విక్స్ వెపోర‌బ్ వంటి వాటిల్లో ఆయింట్ మెంట్ ల‌లో చ‌ర్మానికి పూత‌గా పూసే వాటిల్లో క‌ర్పూరాన్ని ఉప‌యోగిస్తారు. శ్వాస నాళాల్లో ఊపిరి స‌ల‌ప‌డానికి వాడే మందుల్లోనూ దీనిని వాడ‌తారు. క‌ర్పూరం నూనెలో దూదిని ముంచి కుష్టు వ్యాధి వ‌ల్ల క‌లిగిన గాయాల‌పై రాస్తే గాయాలు త్వ‌ర‌గా మానుతాయి.

amazing health benefits of using Camphor
Camphor

శ‌రీరంపై మ‌న‌కు తెలియ‌ని ఎన్నో సూక్ష్మ జీవులు ఉంటాయి. క‌నుక ప్ర‌తిరోజూ మ‌నం స్నానం చేసే నీటిలో కర్పూరాన్ని వేసుకుని స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంపై ఉండే సూక్ష్మ క్రిములు న‌శిస్తాయి. కొన్ని క‌ర్పూరం బిళ్ల‌ను మూట‌గా క‌ట్టి రాత్రి ప‌డుకునే ముందు మన మీద వేసుకుని ప‌డుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ సాఫీగా సాగుతుంది. కర్పూరం శ‌రీరంలో జీవ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. అంతేకాకుండా బ్ర‌ష్ మీద క‌ర్పూరం పొడిని వేసి దానిపై టూత్ పేస్ట్ ను వేసి దంతాల‌ను శుభ్రం చేసుకోవాలి. ఇలా క‌ర్పూరంతో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డం వ‌ల్ల దంత స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి. క‌ర్పూరంతో దేవుడికి హార‌తి ఇస్తూ ఉంటారు.

ఆ స‌మ‌యంలో క‌ర్పూరం నుండి పొగ ఎక్కువ‌గా వ‌స్తుంది. ఈ పొగ‌ను పీల్చ‌డం వల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌. క‌ళ్ల‌కు మేలు చేస్తుంది క‌నుక‌నే కాటుక‌లో దీనిని వాడ‌తారు. జలుబు, క‌ఫాన్ని త‌గ్గిస్తుంది. ర‌క్తాన్ని శుద్ధి చేసి ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ‌ను మెరుగుప‌రుస్తుంది. దేవాల‌యం వంటి ప‌విత్ర ప్ర‌దేశాల‌లో కూడా స్త్రీ , పురుషుల మ‌ధ్య ఆక‌ర్ష‌ణ క‌లిగే అవ‌కాశం ఉంది. మ‌న‌సు చంచ‌ల‌మ‌య్యే అవ‌కాశం ఉంది. అలాంటి కామ కోరిక‌లు క‌ల‌గ‌కుండా క‌ర్పూరం మ‌న‌కు మేలు చేస్తుంది. పురుగుల మందుల్లో, చెడు వాస‌న‌ల నావార‌ణ‌కు, బ‌ట్ట‌ల‌ను కొరికి తినే చెద పురుగులు, ఇత‌ర కీట‌కాల నిర్మూల‌న‌కు, దోమ‌ల నివార‌ణ‌కు కర్పూరాన్ని విరివిరిగా ఉప‌యోగిస్తారు.

తేలు కాటుకు గురైన వారికి ఆపిల్ ర‌సంలో క‌ర్పూరాన్ని క‌లిపి అర‌గంట‌కొక‌సారి తాగిస్తూ ఉంటే తేలు విషం చెమ‌ట‌, మూత్రం రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తుంది. పెయింటింగ్, బాణాసంచా, సుగంధ ప‌రిమ‌ళాలు వెద‌జ‌ల్లే వాటిల్లో కూడా క‌ర్పూరాన్ని వాడ‌తారు. కొన్ని ర‌కాల సాఫ్ట్ డ్రింక్స్, ద‌గ్గు మందులు, చాక్లెట్ ల త‌యారీలో కూడా క‌ర్పూరాన్ని వాడ‌తారు. క‌ర్పూరాన్ని వెలిగించ‌గా వ‌చ్చే పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల ఆందోళ‌న‌, ఒత్తిడి, అస్థ‌మా, త‌ట్టు, తత్త‌ర పాటు, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయ‌ట‌. అంతేకాకుండా ఈ పొగ కార‌ణంగా గాలిలో ఉండే క్రిములు, బ్యాక్టీరియా వంటివి కూడా న‌శిస్తాయ‌ట‌. చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు దూరం అవుతాయ‌ట‌.

జ్ఞాప‌క‌శ‌క్తి వృద్ధి చెందుతుంద‌ట‌. క‌ర్పూరాన్ని వెలిగించ‌డం వల్ల పాజిటివ్ ఎన‌ర్జీ వ‌స్తుంది. ఈ పాజిటివ్ ఎన‌ర్జీ అంతా మ‌న‌లోకి వెళ్లి మ‌న‌కు అంతా మంచే జ‌రుగుతుంద‌ట‌. వేపాకు ముద్ద‌లో క‌ర్పూరాన్ని క‌లిపి త‌ల‌కు పట్టించాలి. గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌ల‌లో పేల స‌మ‌స్య త‌గ్గుతుంది. మార్కెట్ లో ర‌సాయ‌నాల‌తో చేసిన క‌ర్పూరం కూడా ల‌భిస్తుంది. దీనిని వాడ‌డం వ‌ల్ల మ‌నం అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. క‌నుక స‌హ‌జ‌సిద్దంగా త‌యారు చేసిన క‌ర్పూరాన్ని వాడి ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌ల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.

Share
D

Recent Posts