హెల్త్ టిప్స్

Beetroot Juice For Eye Sight : మసక తగ్గి కంటి చూపు క్లియర్ గా ఉండాలంటే.. వీటిని అస్సలు మరచిపోకుండా రోజూ తీసుకోండి..!

Beetroot Juice For Eye Sight : ఈరోజుల్లో, ఎక్కువసేపు స్క్రీన్ల ముందు గడపడం వలన కంటి సమస్యలు సర్వసాధారణంగా వస్తున్నాయి. చిన్న పిల్లలు మొదలు, పెద్దవాళ్ల వరకు కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పైగా పూర్వం మంచి ఆహారపదార్థాలను తీసుకునేవారు. కానీ, రాను రాను ఆహార పదార్థాలు తీసుకునే పద్ధతి కూడా మారింది. అలానే, జీవనశైలి కూడా బాగా మారిపోవడంతో, అనారోగ్య సమస్యలు తప్పట్లేదు. టీనేజ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జంక్ ఫుడ్ ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఎక్కువగా బయట, జంక్ ఫుడ్ ని తీసుకుంటూ ఉంటారు. ఈ జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన అనేక ఇబ్బందులు కలుగుతాయి.

టీనేజ్ లో ఉండే వాళ్ళు, కచ్చితంగా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలి. టీనేజ్ లో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. పైగా టీనేజ్ లో ఎక్కువ బరువు పెరిగే, అవకాశం ఉంటుంది. ముఖంపై మొటిమలు కూడా వస్తూ ఉంటాయి. సో, ఇటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి, మంచి ఆహారాన్ని తీసుకోవడానికి చూడాలి. జంక్ ఫుడ్ వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు. కంటి చూపుని మెరుగుపరిచే, ఆహార పదార్థాలను తీసుకుంటే, కంటిచూపు బాగుంటుంది.

Beetroot Juice For Eye Sight take daily for many benefits

కంటి చూపు కోసం క్యారెట్, బీట్రూట్, టమోటా వంటివి తీసుకుంటే మంచిది. మునగాకుని తీసుకుంటే, కూడా కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. అయితే, వీటన్నిటినీ కూడా మిక్సీలో వేసి రసం తీసుకుని, ఎండు ఖర్జూరం పొడి వేసుకుని తాగితే, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఉదయం టిఫిన్ గా పచ్చికొబ్బరి ని, నానబెట్టిన పెసలు, వేరుశనగలను తీసుకుంటే మంచిది.

మధ్యాహ్నం పూట అన్నం వండేటప్పుడు, అందులో సోయా గింజల్ని వేసి వండుకోండి. లేదంటే రాజ్మా గింజలైనా వేసుకోవచ్చు. ఆకుకూరలను కూడా ఎక్కువగా తీసుకోవడం మంచిది. సాయంత్రం పూట పుచ్చకాయ గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, బాదంపప్పు కలిపి తీసుకుంటే మంచిది. ఇలా టీనేజ్ లో ఉండే వాళ్ళు, వీటిని తీసుకున్నట్లయితే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా, కంటి సమస్యలు వుండవు.

Admin

Recent Posts