ఆధ్యాత్మికం

Kiradu Temple : ఈ దేవాలయంలోకి సూర్యాస్తమయం తరువాత వెళ్తే అంతే.. రాళ్లుగా మారిపోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Kiradu Temple &colon; అసలు ఈ ప్రపంచమే ఓ పెద్ద వింత&period; దీంట్లో మనకు తెలియని&comma; తెలిసిన వింతలు&comma; విషయాలు ఎన్నో ఉన్నాయి&period; అయితే వీటిలో కొన్ని కొంత కాలం పాటు వింతలుగా ఉన్నా కాలానుగుణంగా అవి ఆ స్థాయిని కోల్పోతాయి&period; కానీ కొన్ని వింతలు మాత్రం ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంటాయి&period; అలాగే కొనసాగుతాయి&period; ఎన్నేళ్లయినా వాటిలో ఎలాంటి మార్పు ఉండదు&period; కాకపోతే వాటి గురించి ఎప్పటికప్పుడు కొత్తవారు తెలుసుకుంటూనే ఉంటారు&period; కాగా రాజస్థాన్‌లోని ఓ దేవాలయం కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది&period; ఇందులో వింత&comma; రహస్యం ఏముంది అంటారా&period;&period;&quest; అక్కడికే వస్తున్నాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముట్టుకోగానే రాయిలా మారిపోయేలా చూపించే సినిమాలను మనం గతంలో చూశాం కదా&period; ఆ&period;&period;&excl; అవును&period;&period;&excl; ఈ దేవాలయం కూడా అలాంటిదే&period; కాకపోతే ఇందులో సూర్యాస్తమయం తరువాత ఉండకూడద‌ట‌&period; ఉంటే ఇక అంతే సంగతుల‌ట‌&period;&period;&excl; వారు తెల్లారేసరికి రాయిలా మారిపోతారట&period; గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది&period; అసలు దీనికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం&period; రాజస్థాన్‌లోని బద్మెర్ జిల్లాలో కిరడు అనే పేరిట ఓ దేవాలయం ఉంది&period; ఇందులో దాగి ఉన్న రహస్యం పట్ల ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది&period; సూర్యాస్తమయం దాటిన తరువాత ఈ దేవాలయంలో ఎవరైనా ఉంటే వారు తెల్లవారేసరికి రాళ్లలా మారిపోతారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54912 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;Kiradu-Temple&period;jpg" alt&equals;"Kiradu Temple people who enter into this after sunset will become stone " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొన్ని వేల ఏళ్ల కిందట ఓ రుషి తన విద్యార్థులతో కలిసి ఈ కిరడు దేవాలయానికి వచ్చాడట&period; అయితే ఆ రుషి తన విద్యార్థులను దేవాలయం సమీపంలో వదలి స్థానికంగా ఉన్న ఓ ప్రాంతాన్ని చూసేందుకు బయటికి వెళ్లాడట&period; ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరూ ఆ విద్యార్థులకు సహాయం చేయలేదట&period; కొన్ని రోజుల తరువాత ఆ రుషి తిరిగి వచ్చాడు&period; కాగా అప్పటికే ఆ విద్యార్థుల ఆరోగ్యం క్షీణించింది&period; ఈ క్రమంలో వారిని చూసిన ఆ రుషి జరిగిన విషయం తెలుసుకున్నాడు&period; దీంతో ఆగ్రహించిన రుషి రాయి లాంటి హృదయం కలిగిన స్థానికులను రాళ్లుగా మారమని శపించాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాగా ఆ గ్రామంలో కేవలం ఒకే ఒక్క మహిళ ఆ విద్యార్థులకు సహాయం చేసింది&period; ఆ రుషి ఈ విషయం కూడా తెలుసుకున్నాడు&period; దీంతో ఆమెకు శాపం వర్తించకుండా చేశాడు&period; అయితే ఆమెను వెనక్కి తిరిగి చూడకుండా పోవాలని ఆదేశించాడు&period; కానీ ఆ మహిళ వెళ్లే క్రమంలో వెనక్కి తిరిగి చూసింది&period; దీంతో ఆమె కూడా రాయిగా మారిపోయింది&period; అయితే అలా రాయిగా మారిన మహిళ విగ్రహం ఇప్పటికీ ఆ గ్రామంలో అలాగే ఉందట&period; ఆ విగ్రహం దేవాలయానికి కొంత సమీపంలో ఉంటుంది&period; కాలానుగుణంగా ఆ శాపం కాస్తా దేవాలయానికే పరిమితమైందని చెబుతారు&period; అందుకే ఆ దేవాలయంలో సూర్యాస్తమయం తరువాత ఉన్న వారు రాళ్లుగా మారుతారట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts