High BP : నేటి తరుణంలో మనలో చాలా మందిని భాదిస్తున్న అనారోగ్య సమస్యల్లో బీపీ ఒకటి. దీనిని సైలెంట్ కిల్లర్ గా చెబుతూ ఉంటారు. ఎటువంటి బాధ లేకుండా మనిషి ప్రాణం పోవడానికి దారి తీస్తుంది ఈ బీపీ. బీపీ కారణంగా మూత్రపిండాలు వైఫల్యం చెందుతాయి. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. పక్షవాతం రావడానికి కూడా ప్రధాన కారణం ఈ బీపీయే. అయితే చాలా మందిలో వారికి బీపీ ఉన్నట్టుగానే తెలియడం లేదు. ఎటువంటి లక్షణాలు, సమస్యలు తలెత్తకపోయే సరికి చాలా మంది వారికి బీపీ లేదు అని భావిస్తున్నారు. ఈ సమస్య మరింత తీవ్రమయ్యి తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడిన తరువాతనే చాలా మంది బీపీకి సంబంధించిన పరీక్షలు చేయించుకుంటున్నారు. అనారోగ్య సమస్యల బారిన పడడాని కంటే ముందుగానే మనం తరచూ బీపీ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు వాడాల్సిందే. కనుక బీపీ ఉన్నది తెలియగానే వెంటనే మందులు వాడకుండా సహజ సిద్దంగా కూడా ఈ బీపీని మనం అదుపులోకి తెచ్చుకోవచ్చు. మొదటి దశ ( 129 – 89) హైబీపీతో బాధపడే వారు మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా రెండు నెలల్లోనే బీపీ సాధారణ స్థాయికి వచ్చేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మొదటి దశ హైబీపీతో బాధపడే వారు యాలకుల పొడిని వాడడం వల్ల సహజంగా బీపీని తగ్గించుకోవచ్చని నిపుణులు పరిశోధనల ద్వారా తెలియజేసారు. రోజూ ఉదయం 3 గ్రాములు, అలాగే సాయంత్రం 3 గ్రాముల యాలకుల పొడిని ఇచ్చి 20 మందిపై రెండు నెలల పాటు జరిపిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని వారు చెబుతున్నారు. అలాగే అధిక రక్తపోటు అదుపులో లేని వారు కూడా ఈ యాలకుల పొడిని వాడడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుందని వారు చెబుతున్నారు. పూటకు మూడు గ్రాముల మోతాదులో రెండు పూటలా యాలకుల పొడిని వాడడం వల్ల మందులు వాడే అవసరం లేకుండా అధిక రక్తపోటు చాలా సులభంగా అదుపులోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఈ యాలకుల పొడిని వాడడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిండెంట్లు 90 శాతం వరకు పెరిగాయని నిపుణులు ఈ పరిశోధనల ద్వారా వెల్లడించారు. యాంటీ ఆక్సిడెంట్లు పెరగడం వల్ల మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. అయితే అధిక రక్తపోటు సమస్య చాలా భయంకరమైనదని బీపీ రీడింగ్ ఎల్లప్పుడూ 110-80 లోపు ఉండేలా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా యాలకుల పొడిని రెండు పూటలా వాడడం వల్ల మొదటి దశలో బీపీ ఉన్న వారు మందులు వడకుండానే బీపీని తగ్గించుకోవచ్చు. అలాగే యాలకుల పొడిని వాడడం వల్ల అదుపు తప్పిన బీపీ క్రమంగా అదుపులోకి వస్తుందని, దీనిని ఉపయోగించడం వల్ల బీపీ లేని వారికి బీపీ రాకుండా ఉంటుందని వారు చెబుతున్నారు.