Capsicum And Ginger Drink : రోజూ ఒక్క గ్లాస్ చాలు.. ఎంత‌టి వేళ్లాడే పొట్ట అయినా స‌రే క‌రిగిపోతుంది..!

Capsicum And Ginger Drink : మ‌న‌కు సుల‌భంగా ల‌భించే ప‌దార్థాల‌తో పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల పొట్ట‌లో, న‌డుము చుట్టూ, అలాగే ఇత‌ర శ‌రీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా క‌రుగుతుంది. బ‌రువు త‌గ్గించ‌డంలో ఈ పానీయం అద్భుతంగా ప‌ని చేస్తుంది. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎంత‌గానో వేధించే ఈ అధిక బ‌రువు స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి మార్కెట్ లో ల‌భించే మందుల‌ను, పౌడ‌ర్ ల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌క‌పోగా దుష్ప్ర‌భావాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఇలా మందుల‌ను వాడే అవ‌స‌రం లేకుండా మ‌న ఇంట్లోనే సహ‌జంగా ల‌భించే ప‌దార్థాల‌తో జ్యూస్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ పానీయాన్ని తాగిన రెండు వారాల్లోనే మ‌న శ‌రీరంలో వ‌చ్చే మార్పును మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించి బ‌రువు త‌గ్గేలా చేసే ఈ పానీయాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పానీయాన్ని త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం మ‌నం ఒక క్యాప్సికంను, ఒక ఇంచు అల్లం ముక్క‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఇందులోనే చిన్న‌గా త‌రిగిన క్యాప్సికం ముక్క‌ల‌ను, అల్లం ముక్క‌ల‌ను వేసి ముప్పావు గ్లాస్ అయ్యే వ‌ర‌కు మ‌రిగించాలి.

Capsicum And Ginger Drink works effectively for weight loss
Capsicum And Ginger Drink

త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తేనె క‌లిపి తీసుకోవాలి. ఇలా రోజూ ఉద‌యం పూట తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అయితే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు తేనె క‌ల‌ప‌కుండా తీసుకోవాలి. క్యాప్సికంలో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉండ‌డంతో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు కూడా ఉంటాయి. శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వును క‌రిగించ‌డంలో క్యాప్సికం చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. అలాగే మ‌నం తిన్న ఆహారం కొవ్వుగా మార‌కుండా చేయ‌డంలో కూడా క్యాప్సికం మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. అంతేకాకుండా ఈ పానీయాన్ని తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జీర్ణ‌క్రియ స‌క్ర‌మంగా ప‌ని చేస్తుంది. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ విధంగా క్యాప్సికంతో పానీయాన్ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మంచి ఫలితాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts