Dates Water : ఖ‌ర్జూరాల‌తో ఎంత‌టి బ‌రువు అయినా స‌రే సుల‌భంగా త‌గ్గ‌వ‌చ్చు తెలుసా..? ఎలాగంటే..?

Dates Water : ఖ‌ర్జూరాలు.. మ‌నం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో ఇవి ఒక‌టి. ఖ‌ర్జూరాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. వీటిలో ఎన్నో పోష‌కాలు దాగి ఉన్నాయి. ఖ‌ర్జూరాల‌లో ప‌లు ర‌కాల బి విట‌మిన్స్ తో పాటు కాప‌ర్, పొటాషియం, మాంగ‌నీస్, క్యాల్షియం, ఐర‌న్, మెగ్నీషియం, జింక్,క్యాల‌రీలు, ప్రోటీన్, ఫైబ‌ర్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కంటి చూపు మెరుగుప‌డుతుంది. జీర్ణ‌వ్య‌వ‌స్థ స‌క్ర‌మంగా ప‌ని చేస్తుంది. అంతేకాకుండా ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. రోజంతా ఉత్సాహంగా ప‌ని చేసుకోవ‌చ్చు. ఎముక‌లను ధృడంగా చేయ‌డంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ఒత్తిడిని దూరం చేయ‌డంలో, నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా ఖ‌ర్జూరాల‌ను మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేయ‌డంతో పాటు బ‌రువు త‌గ్గ‌డంలో కూడా ఖ‌ర్జూరాలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అధిక బ‌రువు స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది అధిక బ‌రువు, అధిక పొట్ట వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. మారిన మ‌న జీవ‌న విధానం, ఆహార‌పు అల‌వాట్లే ఈ స‌మ‌స్య బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు బ‌రువు తగ్గ‌డానికి ఎన్నో ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా స‌హ‌జ సిద్దంగా ల‌భించే ఖ‌ర్జూరాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు తగ్గవ‌చ్చు. అయితే అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఖ‌ర్జూరాల‌ను ఎలా తీసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. అధిక పొట్ట, అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌పడే వారు 4 లేదా 5 పండు ఖ‌ర్జూరాల‌ను ముక్క‌లుగా చేయాలి.

Dates Water benefits in telugu how to make it
Dates Water

త‌రువాత ఒక ఇంచు అల్లం ముక్క‌ను శుభ్రం చేసి క‌చ్చా ప‌చ్చ‌గా దంచాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో ఖ‌ర్జూరం ముక్క‌ల‌ను, దంచిన అల్లాన్ని వేసి నీటిని వేడి చేయాలి. ఖ‌ర్జూరాల‌లో ఉండే పోష‌కాలు నీటిలోకి దిగి నీరు రంగు మారిన త‌రువాత ఆ నీటిని వ‌డ‌క‌ట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న నీటిని రోజూ ఉద‌యం తాగ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అంతేకాకుండా ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా అందుతాయి. ఖ‌ర్జూరాల‌ను మితంగా తీసుకోవ‌డం వ‌ల్ల చాలా సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ విధంగా ప్ర‌తిరోజూ ఖ‌ర్జూరాల‌తో నీటిని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు లేకుండా అధిక బ‌రువు స‌మ‌స్య నుండి తేలిక‌గా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts