Coffee : చాలామందికి కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఒక కప్పు కాఫీ తో, చాలా మంది వారి రోజులను మొదలు పెడుతుంటారు. మీరు కూడా రోజూ కాఫీ తీసుకుంటున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి. కాఫీ తో పాటు, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఇటువంటి ఆహార పదార్థాలని కాఫీతో పాటుగా తీసుకున్నట్లయితే, ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
కాఫీ తో పాటుగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే, శరీరం పై ప్రతికూల ప్రభావాలను అది చూపిస్తుంది. కాఫీ తాగే ముందు, కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదు. కాఫీ తాగడానికి ముందు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. కాఫీ తీసుకునే వాళ్ళు, ఉదయాన్నే కాఫీతో పాటు పాల ఉత్పత్తులను తీసుకోవద్దు. పాల ఉత్పత్తులు వంటి క్యాల్షియం మూలాలని నివారించండి. కెఫిన్ క్యాల్షియం శోషణని ప్రభావితం చేస్తుంది. కాబట్టి, కాఫీ తో పాటుగా వీటిని అసలు తీసుకోవద్దు.
కాఫీ వలన శరీరం జింక్ పోషకాలను గ్రహించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. కాఫీ తాగడం వలన మీరు గ్రహించే జింక్ ని బయటికి పంపించేస్తుంది. రెడ్ మీట్, పౌల్ట్రీ, నట్స్ వంటి వాటిని తీసుకోవద్దు. అదేవిధంగా ఐరన్ ఉండే ఆహార పదార్థాలను కూడా కాఫీ తో పాటుగా తీసుకోకండి. కాఫీ తాగడానికి ముందు బఠానీలు, గింజలు, చిక్కుళ్ళు, సోయా ఉత్పత్తులు తీసుకోవద్దు. అలానే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకండి.
అలానే, విటమిన్ డి స్థాయిలని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. కాఫీతో పాటుగా విటమిన్ డి ఉండే ఆహార పదార్థాలను తీసుకోవద్దు. కాఫీ తో పాటుగా వేయించిన ఆహార పదార్థాలు వంటివి తీసుకోవద్దు. వేయించిన ఆహార పదార్థాలలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. కాఫీ తో పాటు ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకుంటే, శరీరంలో కొవ్వు త్వరగా పెరిగిపోతుంది. కనుక వీటిని తీసుకోవద్దు.