Pickles : ప‌చ్చ‌ళ్ల‌ను తిన‌డం ఆరోగ్య‌క‌ర‌మేనా.. డాక్ట‌ర్లు ఏమంటున్నారు..?

Pickles : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ప‌చ్చ‌ళ్ల‌ను తింటున్నారు. చాలా మంది ప‌చ్చ‌ళ్ల‌ను ఏళ్ల‌కు ఏళ్లు నిల్వ చేసేవారు. కానీ అలాంటి రోజులు ఇప్పుడు పోయాయి. ఇప్పుడు ప‌చ్చ‌ళ్ల‌ను నిల్వ చేసి తింటున్నారు. కానీ 2 లేదా 3 నెల‌ల‌కు మించి నిల్వ చేయ‌డం లేదు. కార‌ణం ఏమిటంటే.. స‌హ‌జంగానే మ‌నం ప‌చ్చ‌ళ్ల‌ను ఎక్కువ‌గా తింటాం. క‌నుక దీంతో జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు లేదా గుండె స‌మస్య‌లు వ‌స్తాయ‌ని వైద్యులు చెబుతుంటారు. క‌నుక‌నే మ‌నం ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల‌ను ఎక్కువ‌గా తిన‌డం లేదు. అయితే వాస్త‌వానికి వీటిని రోజూ కాకుండా అప్పుడ‌ప్పుడు తీసుకుంటే లాభాలే క‌లుగుతాయ‌ని డాక్ట‌ర్లు చెబుతున్నారు.

ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల‌ను అప్పుడ‌ప్పుడు తింటే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నే పొంద‌వచ్చ‌ని వైద్యులు అంటున్నారు. ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల‌లో ప్రొబ‌యోటిక్స్ ఉంటాయి. అంటే వీటిలో ఉండే బాక్టీరియా మ‌న జీర్ణాశ‌యానికి మేలు చేస్తుంద‌న్న‌మాట. దీంతో గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఇక ప‌చ్చ‌ళ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గానే ఉంటాయి. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. క్యాన్స‌ర్ రాకుండా చూస్తాయి. అలాగే గుండె జ‌బ్బుల బారి నుంచి మ‌న‌ల్ని రక్షిస్తాయి.

does eating Pickles is healthy or what doctors saying
Pickles

అధిక బ‌రువు త‌గ్గుతారు..

ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల‌ను తినడం వ‌ల్ల జీర్ణ‌క్రియ మెరుగు ప‌డుతుంది. క్యాన్స‌ర్‌, శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు రాకుండా అడ్డుకోవ‌చ్చు. కండ‌రాల నొప్పులు ఉన్న‌వారు, కాలి పిక్క‌లు ప‌ట్టుకుపోయే వారు ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అధిక బ‌రువును త‌గ్గించడంలోనూ ప‌చ్చ‌ళ్లు మేలే చేస్తాయి. వీటిల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పైగా వీటిని తింటే ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ‌ప‌డుతుంది. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌ర‌చూ ప‌చ్చ‌ళ్ల‌ను తినాలి.

ప‌చ్చ‌ళ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేసి క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. ఇలా ఊర‌గాయ ప‌చ్చ‌ళ్ల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కానీ వీటిని రోజూ తిన‌కూడ‌దు. రోజూ తింటే లాభాలు క‌ల‌గ‌క‌పోగా న‌ష్టాలు క‌లుగుతాయి. ప‌చ్చ‌ళ్ల‌లో ఉప్పు ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక వీటిని తింటే బీపీ పెరిగే చాన్స్ ఉంటుంది. హైబీపీ ఉన్న‌వారు ప‌చ్చ‌ళ్ల‌ను అస‌లు తిన‌కూడ‌దు. ఇక ప‌చ్చ‌ళ్ల‌ను మోతాదుకు మించి రోజూ అధికంగా తింటే జీర్ణాశ‌యంలో లేదా పేగుల్లో అల్స‌ర్లు ఏర్ప‌డి క్యాన్స‌ర్‌కు దారి తీస్తాయ‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక ప‌చ్చ‌ళ్ల‌ను తినండి. కానీ అప్పుడ‌ప్పుడు తినండి. రోజూ తిన‌కండి. దీంతో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts