నీరు జీవించాలంటే అత్యవసరం. నీరు లేకుండా జీవించటం అసాధ్యం. శరీరంలో తగినంత నీరు, ఆహారం, వ్యాయామాలు మిమ్మల్ని ఆరోగ్యంగా వుంచుతాయి. నీటిని వేడిగా లేదా చల్లగా తాగచ్చు. అయితే, వేడినీరు శరీరానికి మంచిదని రక్తప్రసరణ మెరుగుపరుస్తుందని కనుగొనన్నారు. ముక్కు దిబ్బడలను తొలగిస్తుంది. తేనె, నిమ్మరసం లతో కలిపిన వేడినీరు అధిక బరువును నిరోధించేందుకు, వ్యాధినిరోధకతను పెంచేందుకు తోడ్పడుతుంది. ఆహారంలో తీసుకొన్న నూనె, కేలరీలను చల్లటి నీరు మరింత గట్టిపడేస్తుంది. వేడి నీరు శరీరానికి ఏ రకంగా ప్రయోజనకారో చూద్దాం!
వేడినీరు శరీరంపై పోసుకుంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. క్రమేణా స్వేదగ్రంధులు తెరువబడతాయి. చెమట వస్తుంది. శరీరం చల్లబడుతుంది. వేడినీటితో చెమట వస్తే శరీరంలోని చెడు మలినాలు బయటకు రావటమే కాదు రక్త ప్రవాహం శుభ్రపడుతుంది. వేడినీరు నరాల వ్యవస్ధను శుభ్రపరిచి మనస్సును కూడా ప్రశాంతం చేస్తుంది. బరువు తగ్గాలంటే వేడినీరు ఉపయోగించవచ్చు. దగ్గు, జలుబులనుండి బాధపడేవారు వేడినీటితో త్వరగా ఉపశమనం పొందవచ్చు. టీ లేదా కాఫీ కి బదులుగా వేడినీరు తాగితే సత్వర ఉపశమనం కూడా వుంటుంది.
వేడి నీరు ఎపుడు తీసుకోవాలి? ప్రతి భోజనం తర్వాత వేడి నీరు తాగవచ్చు. లేదా కనీసం వారానికి రెండు లేదా మూడు సార్లు వేడినీరు తాగండి. బరువు తగ్గాలనుకునేవారు వేడినీరును నిమ్మరసంతో కలిపి భోజనం తర్వాత తాగితే ఫలితాలు అధ్భుతంగా వుంటాయి. ఉదయంపూట ఖాళీ పొట్టతో నులివెచ్చని నీరు తాగితే శరీర వ్యవస్ధ చక్కబడి నిద్రలోని అలసట తగ్గుతుంది. గిన్నెలో కాచిన నీటిని తీసుకోటానికి ప్రయత్నం చేయండి. మెషీన్లనుండి వచ్చే వేడినీరు మెటల్స్ కరిగి వుంటుంది. కనుక వేడి నీటిని బరువు తగ్గించే మెడిసిన్ గా వాడుతూ ఆరోగ్యకరంగా కూడా జీవించవచ్చు.