హెల్త్ టిప్స్

Eggs : గుడ్లు తింటే గుండెకు ఏమైనా హాని క‌లుగుతుందా.. రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

Eggs : ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలని తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏమీ మన దరి చేరవు. అయితే ఆరోగ్యం బాగుండడానికి చాలా మంది రోజు గుడ్లు తీసుకుంటూ ఉంటారు. గుడ్లు తింటే ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు కలుగుతాయని భావిస్తారు. అయితే రోజుకి ఎన్ని గుడ్లు తీసుకోవాలి..? గుడ్లు తింటే గుండె మీద అది ప్రభావం చూపిస్తుందా.. అనే విషయాలని ఆరోగ్య నిపుణులు మనతో పంచుకున్నారు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు చూద్దాం.

లిమిట్ గా గుడ్లు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంద‌ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుడ్లు తీసుకుంటే ప్రోటీన్ బాగా అందుతుంది. అలాగే ఆరోగ్యానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పిల్లలు కూడా గుడ్లు తీసుకోవచ్చు. గుడ్లు తింటే ప్రోటీన్ బాగా అంది. పుష్టిగా తయారవుతారు. అయితే స్టడీ ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఈ విషయం గురించి చాలా మందికి తెలియదు.

eggs effect on heart can we eat them daily

హార్ట్ మాక్సిన్ లో ప్రచురించబడిన 2018 అధ్యయనం ప్రకారం చూసుకున్నట్లయితే చైనాలోని దాదాపు అర మిలియన్ మంది ప్రతిరోజూ గుడ్లు తినేవారు, గుండె జబ్బులు, స్ట్రోక్ తో బాధపడుతున్నట్లు తెలిసింది. గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గిందని తెలుస్తోంది. అయితే గుడ్డు తీసుకోవడం వలన రక్తంలో హృదయ ఆరోగ్య సూచికలు ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఈ స్టడీ ద్వారా కనుగొన్నారు. లిమిట్ గా గుడ్లు తీసుకున్న వ్యక్తుల రక్తనాళాల నుండి కొవ్వు తొలగిపోతుంది.

అలానే గుండెపోటు, స్ట్రోక్ వంటి బాధలనుండి దూరంగా వుండచ్చని తెలిసింది. గుండె జబ్బులతో సంబంధం ఉన్న 14 జీవక్రియ రుగ్మతలను కూడా పరిశోధకులు గుర్తించడం జరిగింది. త‌క్కువ గుడ్డు తీసుకునే వాళ్ళతో పోల్చుకుంటే ఎక్కువ గుడ్లు తిన్న వాళ్ళలో సమస్యలు లేనట్టు గుర్తించారు. రోజూ ఒక‌ గుడ్డు తీసుకోవడం వలన ఈ లాభాలని పొందవచ్చ‌ని చెబుతున్నారు.

Admin

Recent Posts