Immunity Tips : సీజన్లు మారేకొద్దీ మనకు తరచూ పలు అనారోగ్య సమస్యలు వస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఒక్కో సీజన్‌ను బట్టి మనకు వచ్చే సమస్యలు చాలా భిన్నంగా ఉంటాయి. వర్షాకాలం వస్తుంది కనుక మనకు దగ్గు, జలుబుతోపాటు జ్వరం కూడా వస్తుంది. దీంతోపాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే దోమలు అధికంగా వృద్ధి చెందుతాయి. కనుక దోమలను నియంత్రించే ఏర్పాట్లు చేసుకోవాలి. అవి కుట్టడం వల్ల వచ్చే వ్యాధులతో బాధపడడం కన్నా ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే.. డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇక ఈ సీజన్‌లో మనకు అనేక బాక్టీరియా, వైరస్‌ల మూలంగా వ్యాధులు వస్తాయి. కనుక వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అందుకు గాను మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి. దీంతో వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఒక వేళ వచ్చినా తక్కువ నష్టంతో బయట పడవచ్చు. ఇక రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సీజన్ లో మనకు బాక్టీరియా, వైరస్‌ల మూలంగా వ్యాధులు వస్తాయి. కనుక వాటికి అడ్డుకట్ట వేసేందుకు యాంటీ బయోటిక్, యాంటీ వైరల్ ఆహారాలను తీసుకోవాలి. వాటిల్లో పసుపు ప్రధానమైంది అని చెప్పవచ్చు. ఇది యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలను కూడా కలిగి ఉంటుంది. కనుక దీన్ని తీసుకుంటే వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో కాస్త పసుపు కలిపి తాగవచ్చు. ఇలా చేసినా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇక ఉదయం పరగడుపునే 4 నుంచి 5 వేపాకులను అలాగే నమిలి మింగడం వల్ల బాక్టీరియా, వైరస్, ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. దీంతోపాటు జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రంగా మారుతుంది. అలాగే ఫుడ్ పాయిజనింగ్ కాకుండా ఉంటుంది. ముఖ్యంగా టైఫాయిడ్ వంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
అలాగే ఉదయం పరగడుపునే 4 లేదా 5 తులసి ఆకులను నమిలి మింగాలి. ఇలా చేసినా కూడా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు వంటి వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఇక దాల్చిన చెక్క, లవంగాలు వేసి తయారు చేసిన కషాయంలో కాస్త తేనె కలిపి తాగుతున్నా కూడా రోగ నిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. దీంతోపాటు విటమిన్ సి అధికంగా ఉండే నారింజ, నిమ్మ, కివీ, పైనాపిల్, బొప్పాయి వంటి పండ్లను అధికంగా తినాలి. ఇవి కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇలా వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యవస్థ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీంతో వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. వచ్చాక బాధపడడం కన్నా రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఇలా చేయడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు.