Foods For Heart Health : నేటి తరుణంలో చిన్న వయసులోనే గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. బీపీ వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో రక్తం చిక్కగా తయారవుతుంది. చిక్కగా తయారైన రక్తాన్ని గుండె సరిగ్గా సరఫరా చేయలేదు. రక్తప్రసరణలో ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా కొన్ని సార్లు మనం ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. రక్తం పలుచగా ఉంటేనే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. ఆరోగ్యానికి హాని కలగకుండా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. రక్తాన్ని పలుచగా చేయడం కోసం చాలా మంది బ్లడ్ తిన్నర్ లను వాడుతూ ఉంటారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వారు, బైపాస్ ఆపరేషన్ అయిన వారు, హైబీపీ ఉన్న వారు, రక్తం గడ్డకట్టే అవకాశం ఎక్కువగా ఉన్న వారికి వైద్యులు వీటిని ప్రతిరోజూ వాడమని చెబుతూ ఉంటారు.
అలాగే సమస్య ఉన్నా లేకున్నా కూడా కొందరు వీటిని ప్రతిరోజూ వాడుతూ ఉంటారు. అయితే వీటిని ఒక్కసారి వాడడం ప్రారంభిస్తే జీవిత కాలం వాడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి ఈ బ్లడ్ తిన్నర్ లను వాడి మరలా వీటిని వాడడం మానేస్తే ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. అయితే మన జీవన విధానంలో మార్పు చేసుకోవడం వల్ల బ్లడ్ తిన్నర్ లను జీవితకాలం వాడే అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. నీటిని తక్కువగా తాగడం, ఉప్పును ఎక్కువగా తీసుకోవడం, నూనెలో వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వంటి వాటి వల్ల రక్తం చిక్కగా తయారవుతుంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తాన్ని చిక్కగా చేసే గుణం ఉప్పుకు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆహారాల్లో ఉప్పును, నూనెను తీసుకోవడం తగ్గిస్తే మనం రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడే అవసరమే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఉడికించిన ఆహారాలకు బదులుగా సహజ సిద్ద ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉప్పును, నూనెను వాడే అవసరమే ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం వెజిటేబుల్ జ్యూస్ ను తీసుకోవాలి. దీనిని తీసుకున్న ముప్పావు గంట తరువాత మొలకెత్తిన విత్తనాలను తీసుకోవాలి. మధ్యాహ్నం ఉప్పు, నూనె లేకుండా కూరలు వండుకుని తీసుకోవాలి. సాయంత్రం 4 గంటల సమయంలో ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే 7 గంటల లోపు పండ్లను ఆహారంగా తీసుకోవాలి. సాయంత్రం భోజనంలో బాదం పప్పు, వాల్ నట్స్, చియా విత్తనాలు వంటి గుండెకు మేలు చేసే గింజలను తీసుకోవడం వల్ల ఉప్పు, నూనె వాడే అవసరమే ఉండదు. ఈ విధంగా ఉదయం, సాయంత్రం సహజ ఆహారాలను తీసుకోవడం వల్ల రెండు నెలల్లోనే మనం మందులు మానేయోచ్చని నిపుణులు చెబుతన్నారు. ఇటువంటి ఆహార నియమాలను పాటించడం వల్ల బ్లడ్ తిన్నర్ లను వాడే అవసరమే ఉండదని నిపుణులు తెలియజేస్తున్నారు.