ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. అందుకే దీనికి అవసరమైన పోషకాలను ఎలా తీసుకోవాలో దాని పై దృష్టి సారిస్తున్నారు. వంటకు వివిధ రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఇమ్యూనిటీని పెంచే ఆయిల్స్ ఉన్నాయి. ఆవ నూనె.. ఉత్తర భారతదేశంలో వంటలో ఎక్కువగా దీన్నే వాడతారు. ఘాటన సువాసన ఈ నూనె ప్రత్యకత. ఆవ నూనె వంటకు రుచి ఇవ్వడమే కాదు.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆవ నూనెలో.. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మోనో-అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్, విటమిన్ ఇ, మినరల్స్, ఐరన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
వెల్లుల్లి కూడా వంటగదిలో ముఖ్యమైన భాగంగా ఉంది. ఆహారంలో రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి మేలు కూడా చూస్తుంది. ఇందులో విటమిన్లు, మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఆవాల నూనె మరియు వెల్లుల్లి మిశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనాలు చూస్తే.. ఈ మిశ్రమం రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది. అలసట నుండి ఉపశమనం మరియు శక్తి స్థాయి కూడా పెంచుతాయి. ఈ మిశ్రమం వలన జాయింట్ పెయిన్ రిలీఫ్ గణనీయంగా తగ్గుతూ వస్తుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.
వెల్లుల్లిలోని యాంటీవైరల్ మరియు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాల కారణంగా ఈ మిశ్రమం ద్వారా ఉత్పన్నమయ్యే జలుబు మరియు ఫ్లూ లక్షణాల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.ఈ మిశ్రమంతో తయారు చేసిన పేస్ట్‌ను అప్లై చేయడం వల్ల పంటి నొప్పి మరియు చిగుళ్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ మిశ్రమం చర్మాన్ని మెరిసేలా చేస్తుంది, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది మరియు ముఖాన్ని తేమ చేస్తుంది, అలాగే దురదను తగ్గిస్తుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఆవ నూనె ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పేరుకుపోవడం, ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం అందిస్తుంది. ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందడానికి, వేడినీటిలో కొన్ని చుక్కల ఆవాల నూనె వేసి ఆవిరిని పట్టండి. ఇది కాకుండా, ఆవ నూనెలో వెల్లుల్లి రెబ్బలు వేసి వేడిచేయండి. ఈ నూనెను.. ప్రతిరోజూ పడుకునే ముందు ఛాతీ మీద రాసుకుంటే.. కఫం, శ్లేష్మం కరుగుతుంది.