Healthy Foods For Hair Growth : జుట్టు కుదళ్లు ఆరోగ్యంగా, ధృడంగా ఉంటేనే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఒకవేళ జుట్టు ఊడిపోయినప్పటికి వాటి స్థానంలో మరలా కొత్త జుట్టు 15 నుండి 20 రోజుల్లో వస్తుంది. అయితే జుట్టు కుదుళ్లు బలహీనపడడం వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు రావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జుట్టు కుదుళ్లు బలహీనపడడం వల్ల లేదా దెబ్బతినడం వల్ల ఊడిన జుట్టు స్థానంలో మరలా కొత్త జుట్టు రాకుండా పోతుంది. జుట్టు ఆరోగ్యం అంతా కూడా జుట్టు కుదుళ్లపై ఆధారపడి ఉంటుంది. కనుక మనం జుట్టు కుదుళ్లను బలపరిచే చర్యలు తీసుకోవాలి. జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ ఎక్కువగా జరగాలి. రక్తప్రసరణ ఎక్కువగా ఉండాలంటే శరీరంలో తగినంత రక్తం ఉండడం చాలా అవసరం. రక్తప్రసరణ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు కుదుళ్లకు పోషకాలు ఎక్కువగా అందుతాయి.
అలాగే జుట్టు కుదళ్లల్లో ఉండే వ్యర్థాలు రక్తం ద్వారా తొలగించబడతాయి. కనుక శరీరంలో రక్తాన్ని పెంచడంతో పాటు జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను తీసుకోవాలి. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రోటీన్, మినరల్స్, విటమిన్ కె, ఐరన్, విటమిన్ ఇఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. మనం ఒక్క కూరను తయారు చేసుకుంటే చాలు ఈ పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి. మినరల్స్, ఐరన్ ఎక్కువగా ఉండే వాటిల్లో ఆకుకూరలు ఒకటి. పాలకూర, తోటకూర, బచ్చలికూర, గోంగూర, మెంతికూర, పొన్నగంటి కూర వంటి ఆకుకూరలను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ఈ ఆకుకూరలను కందిపప్పు, పెసరపప్పు వంటి వాటితో పాటు రాజ్మా గింజలు, సోయా గింజలు, నానబెట్టిన పుచ్చగింజలు వేసి వండుకోవాలి. ఇలా ఆకుకూరలను వండుకోవడం వల్ల ఐరన్, మినరల్స్, ప్రోటీన్, విటమిన్ ఇ, కె వంటి పోషకాలన్నీ కూడా జుట్టు కుదుళ్లకు అందుతాయి.
రోజూ ఇలా ఆకుకూరలను వండుకోని తినడం వల్ల జుట్టు కుదుళ్లకి కావల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే రాలిన జుట్టు స్థానంలో మరలా కొత్త జుట్టు త్వరగా వస్తుంది. జుట్టు ఎదుగుదల చక్కగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఇలా ఆకుకూరలను పప్పులతో వండుకుని తీసుకోవడం వల్ల వారిలో రక్తహీనత తగ్గుతుంది. రక్తహీనత కారణంగా కూడా జుట్టు రాలిపోతుంది. కనుక స్త్రీలు ఇలా ఆకుకూరలను వండుకుని తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా ఉంటుంది. జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా రోజూ ఆకుకూరలను వండుకుని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు సమస్యలు తగ్గుతాయి. జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.