హెల్త్ టిప్స్

వారాంతాల్లో హాయిగా ఆనందంగా గ‌డ‌పాలంటే ఇలా చేయండి..!

వారాంతం సెలవు వస్తూంటుంది…పోతూంటుంది. కాని వారంతం రిలాక్సేషన్ అందరం బాగా పొందుతున్నామా? పొట్టనిండా తిండి తిని సగం రోజు నిద్రించడంతో సరిపోతుంది. ఇక రాత్రయిందంటే, పార్టీలు, చెవులుపగిలే మ్యూజిక్, అనారోగ్య డ్రింక్ లు, జంక్ ఫుడ్ లు. ఒక సెలవుదినంలో పొందాల్సిన ఆనందం వాస్తవంగా పొందుతున్నామా? సెలవులలో రిలాక్స్ అవ్వాలంటే ఎన్నో మంచి మార్గాలున్నాయి. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఎంతో ప్రశాంతంగా, హాయిగా, మంచి ఎనర్జీలతో గడపవచ్చు. ఇది శారీరకంగా మంచి బలాన్నిచ్చి రోగ నిరోధక వ్యవస్ధను బలపరచడమే కాక వయసు త్వరగా మీద పడకుండా చేస్తుంది.

వారాంతపు సెలవులో హాయిగా రిలాక్స్ అవ్వాలంటే…. ఉదయమే నడక లేదా యోగ – పెందలకడ లేవడం, పెందలకడ పడుకోవడం అనేది సెలవురోజు ఒక మంత్రంగా పెట్టుకోండి. ఉదయం 6 గంటల అలారంతో లేచి చక్కటి సూర్యోదయం చూడండి. ఒక్క 15 నిమిషాలు యోగా చేసి కండరాలలో ఒత్తిడి పోగొట్టుకోండి. సెలవు రోజున సరైన ఆహారంతో రోజు మొదలుపెట్టటం బాగుంటుంది. పండ్లు, కూరగాయలు…కేరట్లు, స్ట్రాబెర్రీలు, ఆరెంజ్ లు మొదలైన జ్యూస్ కూడా తీసుకోవచ్చు. ఆయిల్ మసాజ్ చేసి తలంటితో ఎంతో బలంగా వుంటుంది. వీనుల విందైన సంగీతంతో, ఇష్టమైన మేగజైన్ తో కాలక్షేపం చేయండి. ఒత్తిడి బాగా తగ్గేటట్లు వేడినీటిలో సువాసన ద్రవ్యాలు, పూల రేకులు, వేసి, కేండిల్స్ వెలిగించుకొని ఒక ప్రయివేటు స్పా లో వున్న అనుభూతితో స్నానం చేయండి.

how to relax in the weekedns

మీ కిష్టమైన మ్యూజిక్ లేదా ఇష్టమైన పుస్తకం …సీరియస్ ది కాకుండా హాస్యం, జోకులు మొదలైనవి పుస్తకాలు కాకుంటే, టీవి లలో వచ్చే కామెడీ అయిన సరే చూసి ఆనందించండి. నవ్వుని మించిన మెడిసిన్ లేదు. మైండ్ ప్రశాంతంగా వుండి కావలసిన మనో ధైర్యం చిక్కుతుంది. నిద్ర – వారమంతా ఒత్తిడి కల మైండ్ కు మంచి రాత్రి నిద్ర ఎంతో హాయినిస్తుంది. శరీరానికి మైండ్ కు నిద్ర ఎంతో మంచిది. కనీసం 7 లేదా 8 గంటలు తప్పక నిద్రిస్తే మీ బ్లడ్ ప్రజర్ స్ధాయి నియంత్రణలో వుంటుంది. ఈ చిట్కాలు సంకోచించకుండా కుటుంబ సభ్యులకు, ఇతరులకు కూడా చెప్పి ఆచరించేట్లు చేసి ఆనందాలు పంచుకోండి.

Admin

Recent Posts