జీవన విధానం అనారోగ్యంగా వుంటే వయసుకు మించిన ముసలితనం ముఖంలో కనపడుతుందని పరిశోధకులు చెపుతున్నారు. ప్రత్యేకించి బ్లడ్ షుగర్ స్ధాయి సాధారణంకన్నా అధికంగా వుంటే అధికంగా వున్న ప్రతి మిలిమోల్ లీటర్ కు 5 నెలల వయసు అధికంగా ముఖంలో కనపడుతుందని చెపుతున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్ సాధారణంగా వున్న వారు వీరికంటే ఒక సంవత్సరం వయసు తక్కువున్నట్లు ముఖంలోని కవళికలు చెపుతున్నాయట.
ఈ అధిక వయసు చూపటానికి కారణం అధికంగా వున్న బ్లడ్ షుగర్ చర్మం కింది ప్రొటీన్ ను నష్టపరచి దాని బిగువు తగ్గించేస్తోందట. అంతేకాక, ఏజీయింగ్ ప్రక్రియలో ప్రధాన పాత్ర వహించే ఇన్సులిన్ ఉత్పత్తిని బ్లడ్ షుగర్ దెబ్బతీయడంతో తగ్గిన ఇన్సులిన్ ఏజీయింగ్ లో తన విధి నిర్వర్తిచంలేకపోవటం కారణంగా కూడా వాస్తవ వయసుకంటే అధిక వయసు చర్మంలో కనపడుతోందని వారు వివరించారు.
కనుక, బ్లడ్ షుగర్ స్ధాయి అధికంగా వున్నవారు తప్పక వ్యాయామాలు చేసి సరైన ఆహారంతో సరైన జీవన విధానం ఆచరించి ఎప్పటికపుడు షుగర్ వ్యాధిని అదుపులో వుంచుకోవాలని పరిశోధకులు వెల్లడించారు. ఈ పరిశోధనను ప్రధాన రీసెర్చర్ డేవిడ్ గన్ మరో 60 మంది పరిశోధకులు సుమారు 600 మంది బ్లడ్ షుగర్ వున్న వ్యక్తులపై చేసి ఫలితాలను ధృవీకరించినట్లు లండన్ లోని ది టెలిగ్రాఫ్ వార్తా పత్రిక తెలిపింది.