జిఐ అంటే…గ్లైసీమిక్ డైట్… అంటే ఏమిటి? ఆహారం తిన్న తర్వాత అది త్వరగా జీర్ణమై వేగంగా షుగర్ లెవెల్ పెంచేస్తే జిఐ అధికంగా వుండే ఆహారమని అతి అతి నెమ్మదిగా జీర్ణమై షుగర్ లెవల్ తక్కువ స్ధాయిలోనే వుంచితే దానిని తక్కువ జిఐ ఆహారమని అంటారు. త్వరగా జీర్ణమయ్యే ఆహారాలు అంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అధికంగా వుండేవి పాలిష్ చేసిన రైస్, షుగర్ మొదలైనవి.
తక్కువ జిఐ కల ఆహారాలు ఫైబర్ అధికంగా వుండే ఓట్స్, బ్రక్కోలి, గోధుమరవ్వ వంటివిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి జీర్ణం కావాలంటే చాలా సమయం పడుతుంది. సాధారణంగా మనం తినే గ్లూకోజ్ నూటికి నూరు శాతం అధిక జిఐ కలది. దీని ఆధారంగా అధిక, మీడియం, తక్కువ జిఐ శాతాన్ని నిర్ణయిస్తారు. తక్కువ జిఐ శాతం ఆహారాలు డయాబెటీస్, అధికబరువెక్కటం మొదలగు ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా తినాలి.
తిన్న ఆహారాలు త్వరగా గ్లూకోజ్ గా మారి రక్తంలో కలవటం వుండదు. కనుక ఈ రకమైన ఆహారాలు ఎల్లపుడూ తింటే, అధిక బరువు, దాని కారణంగా వచ్చే డయాబెటీస్ వ్యాధులను తేలికగా నయం చేయవచ్చు.