హెల్త్ టిప్స్

రాత్రి పూట చిప్స్ తింటున్నారా..? అయితే హార్ట్ ఎటాక్ గ్యారంటీ..!

చాలా మంది నిద్రపట్టక అర్ధరాత్రి సమయంలో ఏదొకటి తింటూ ఉంటారు. ఇక టీవీ కార్యక్రమాలు చూడటం లేదా అర్ధరాత్రి సమయంలో ఏదొకటి మాట్లాడుకుంటూ తింటూ ఉండటం చేస్తూ ఉంటారు. దాన్ని ఒక టైం పాస్ గా చూస్తూ ఉంటారు కొందరు. అయితే అది అంత మంచిది కాదని అంటున్నారు వైద్యులు. అలా తింటే మీ కొంప మునిగిపోతుందని అంటున్నారు వైద్యులు.

ఆ సమయంలో బంగాళాదుంపల చిప్సు, చెగోడీలు, జంతికలు లాంటి చిరుతిళ్లు తినే అలవాటు చాలా మంది ఉంటుంది. అలా తినేవారికి హృద్రోగాలు, మధుమేహం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. మెక్సికో వర్సిటీ పరిశోధకులు దీనిపై పరిశోధనలు చేయగా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి.

if you are eating chips at night then you will get heart attack

ఈ పరిశోధనలో భాగంగా వారు కొన్ని ఎలుకలకు అవి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం వాటికి పెట్టగా వెంటనే వాటి రక్తంలో కొవ్వు స్థాయులు భారీగా పెరిగిపోయాయి. చురుగ్గా ఉండే పగటి సమయంలో అదే ఆహారం పెట్టినా రక్తంలో కొవ్వు స్థాయిలు అంతగా పెరగలేదని పరిశోధనల్లో గుర్తించారు. దీని తర్వాత ఎలుకల జీవగడియారాన్ని నియంత్రించే భాగాన్ని వాటి మెదడు తొలగించేసారు. ఆ తర్వాత ఏ సమయంలో ఆహారం పెట్టినా వాటి రక్తంలోని కొవ్వు స్థాయుల్లో మార్పు రాలేదని తమ పరిశోధనల్లో స్పష్టంగా గుర్తించారు.

Admin

Recent Posts