హెల్త్ టిప్స్

పీరియడ్స్ లో పెయిన్ తగ్గాలంటే ఇలా చేయండి…!

నెలసరి సమయంలో ప్రతి మహిళకూ నొప్పి అనేది తీవ్రంగా ఉంటుంది. అందరికి ఉండకపోయినా కొందరికి మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి నొప్పులు. దీనితో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అమ్మాయిలు అయితే కాలేజీలకు వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. దీనితో వాళ్ళు పడే ఇబ్బందులు అన్నే ఇన్ని కావు. అయితే దీనిని హోమియో వైద్యంతో నయం చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.

పల్సటిల్లా 30: పెరిగే రక్తస్రావంతో నొప్పి కూడా పెరుగుతూ ఉండేవారికి ఈ ఔషధం సరైనదని సూచిస్తున్నారు. తలతిరుగుడు, వాంతులు, పల్చని విరేచనాలు కూడా ఉంటాయట. నొప్పి తొడలలోకి, అక్కడి నుంచి నడుములోకి పాకడంతో పాటుగా భావోద్వేగాలు కూడా తీవ్రంగా ఉంటాయి వారికి. తీవ్రతను బట్టి పొటెన్సీ 30 నుంచి 200 వరకు పెంచుకునే అవకాశం ఉంటుంది.

take these homeo medicines women have periods pain

బెల్లడోనా 200: పిరుదుల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నెలసరి నొప్పితోపాటు తలనొప్పి కూడా ఎక్కువగానే ఉంటుంది. విపరీతమైన పొత్తికడుపు నొప్పితో పాటు, స్రావం ఉధృతంగా ఉంటుంది. అలాంట‌ప్పుడు ఈ మందును వాడాలి.

మెగ్నీసియా ఫాస్ఫారికా 200: పొత్తికడుపు మీద వెచ్చని కాపడంతో తగ్గే నొప్పి ఉన్నవారికి ఈ మందు బాగా పని చేస్తుందని చెప్తున్నారు వైద్యులు. వీరికి వేడి నీటి స్నానంతో ఉపశమనం కలుగుతూ ఉంటుంది. నెలసరి ప్రారంభంలో విపరీతమైన నొప్పి ఉండి, స్రావం పెరిగేకొద్దీ నొప్పి తగ్గుతుందని సూచిస్తున్నారు. అయితే ఈ మందుల‌ను డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో వాడాల్సి ఉంటుంది.

Admin

Recent Posts