హెల్త్ టిప్స్

జుట్టు బాగా రాలుతుందా..? అయితే ఇలా చేయండి..!

జుట్టు రాలుటకు కారణాలు: పోషక పదార్థాలున్న ఆహారం తీసుకోకపోవడం. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, థైరాయిడ్‌ లోపాలుం డటం, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉండటం. నిద్రలేమితో బాధపడటం. హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వలన చర్మం ప్రభావితమై జుట్టు రాలుతుంది. వెంట్రుకల కుదుళ్ళలో ఏర్పడే ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ వలన, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన వెంట్రుకలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వలన, కొందరిలో శరీరతత్వం బట్టి కూడా జుట్టు రాల‌డం జరుగుతుంది.

నివారణకు జాగ్రత్తలు: జుట్టు నిర్మాణానికి, అది ఎదగడానికి 97 శాతం ప్రోటీన్ల పాత్రే అధికంగా ఉంటుంది. కావున ప్రోటీన్ల లోపం రాకుండా జాగ్రత్త పడటం ముఖ్యం. హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. సబ్బులను డాక్టర్‌ సలహామేరకే వాడాలి. షాంపూ లేదా ఆయిల్‌ను వెంట్రుకల కుదుళ్ళలో, వేళ్లతో నెమ్మదిగా ఎక్కువసేపు మర్దన చేయటం వలన ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

if you are facing hair fall do like this

బయటకు వెళ్ళేటప్పుడు తలకు టోపీ ధరించడం మంచిది. కొవ్వు, నూనె సంబంధిత పదార్థాలు ఎక్కువగా తీసు కోకూడదు. మానసిక ఒత్తిడి కూడా జుట్టు రాలుటపై ప్రభావం చూపు తుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం ప్రతి రోజు యోగా, వ్యాయామం విధిగా చేయాలి.

Admin

Recent Posts