హెల్త్ టిప్స్

తుల‌సి పాకం అంటే ఏమిటో.. దీంతో ఎలాంటి ఉప‌యోగాలు ఉంటాయో తెలుసా..?

తులసి ఆకుల రసం ఒక లీటరు, పటిక బెల్లంపొడి పావు కేజి ఈ రెండు పదార్థాలను సేకరించి తులసి రసంలో పటిక‌ బెల్లం పొడి కలిపి, కరిగించి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి నిదానంగా చిన్న మంటపైన లేద పాకం వచ్చే వరకు మరిగించి దించి తడి తగలకుండా జాగ్రత్తగా నిలువ ఉంచుకోవాలి.

పిల్లలకు దగ్గు జలుబు, జ్వరము, మొదలైన సమస్యలు వచ్చినపుడు ఒక కప్పు నులి వెచ్చని నీటిలో ఈ పాకమును ఒక చెంచా మోతాదుగా కలిపి కరిగించి ఆ నీరు త్రాగించాలి. ఈ నీరు సువాసనగా రుచిగా ఉంటాయి. కాబట్టి పిల్లలు బాగా తాగుతారు. ఈ విదంగా రెండుపూటలా తాగించాలి.

do you know what is tulsi pakam and what are its benefits

పిల్లల కఫ‌ తత్వము క్రమముగా మారుతుంది. నిరంతరముగా దగ్గు, జలబు, జ్వరముతో పీడించబడే బాలలకు ఈ తులసి పాకము అమృతములాగా చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. పిల్లల వయసును బట్టి ఈ పాకము పావు టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదు వరకు నీటిలో కలిపి తాగించాలి.

Admin

Recent Posts