Viral fever : చలికాలంలో ప్రతిచోటా జ్వరాలు పెరుగుతున్నాయి మరియు ఆసుపత్రిలో జలుబు మరియు దగ్గు రోగుల సంఖ్య రోజురోజుకి ఎక్కువవుతుంది. మారిన వాతావరణం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు ఉదయం పూట కురిసే మంచు, సాయంత్రం చల్లగాలలు వీస్తుండడంతో తరచుగా జలుబు, దగ్గులు, వైరల్ ఫీవర్ లతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
మన శరీర ఉష్ణోగ్రత సాధారణం స్థాయి కంటే ఎక్కువగా ఉంటే అది జ్వరం. మన శరీరం జ్వరంతో పోరాడలేనప్పుడు వచ్చే జ్వరం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనినే వైరల్ ఫీవర్ అంటారు. మరి మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవాలంటే ఇంటి చిట్కాలు మనకు బాగా ఉపయోగపడతాయి. ఇంటి చిట్కాలను ఉపయోగించి వైరల్ ఫీవర్ వంటి వ్యాధులను దగ్గరికి రానివ్వకుండా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఒక స్పూన్ కొత్తి మీర విత్తనాలను ఒక గ్లాను నీటిలో కలిపి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లార్చాలి. చల్లారిన నీటిలో పాలు మరియు పంచదార కలపి తాగితే వైరల్ ఫీవర్ తగ్గుముఖం పడుతుంది . కొత్తిమీర విత్తనాలలో ఉండే ఫైటోన్యూట్రియాంట్స్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో ఉండే వైరస్ తో పోరాడి వైరల్ ఫీవర్ ని తగ్గిస్తుంది.
అదే విధంగా తులసి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఒక లీటర్ నీటిలో 40 తాజా తులసి ఆకులను, ఒక స్పూన్ లవంగాల పొడి వేసి నీరు సగం అయ్యేవరకు బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి రెండు గంటలకు ఒకసారి త్రాగితే వైరల్ ఫీవర్ తగ్గుముఖం పడుతుంది. ఇక వైరల్ ఫీవర్ నుంచి కాపాడే ఇంకొక చిట్కా ఏంటి అంటే ఒక కప్పు నీటిలో అల్లం వేసి మరిగించి ఆ నీటిని రోజుకి 3 సార్లు త్రాగితే వైరల్ ఫీవర్ తగ్గుతుంది. అలాగే అల్లంను తేనేలో ముంచుకోని తిన్న కూడా మంచి ఫలితం కనిపిస్తుంది.