వినోదం

ఫిదా సినిమాలో హీరోగా ముందు ఎవరిని అనుకున్నారో తెలుసా.? వరుణ్ తేజ్ ని ఎందుకు తీసుకున్నారంటే.?

తెలుగు సినిమా ప్రేక్షకులకు 2017 ఒక గొప్ప సంవత్సరమే అని చెప్పాలి..తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన బాహుబలి, తెలుగు సినిమా రూల్స్ ని బ్రేక్ చేసి వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి.. సబ్ మెరిన్ ఆధారంగా తెరకెక్కిన ఘాజి.. తెలంగాణ‌ యాసతో వచ్చి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఫిదా ఇలా ఎన్నో సినిమాలు 2017 సంవత్సరంలోనే వచ్చాయి. అయితే ఈ సినిమాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అర్జున్ రెడ్డి సినిమా నిడివి వాస్తవానికి మూడు గంటల నలభై నిమిషాలు. అంటే సుమారుగా రెండు సినిమాల నిడివి అంత. కానీ కారణాల రిత్యా సినిమాను మూడు గంటల పదినిమిషాలకు కుదించారు. సినిమాల సగటు టైంతో పోలిస్తే ఇది కూడా ఎక్కువే.

అర్జున్ రెడ్డిలో కథానాయకుడి మాదిరిగానే ఈ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డిది కూడా మెడిసిన్ బ్యాక్‌గ్రౌండే. అంతేకాదు తను కూడా మంగుళూరు లోనే చదువుకున్నాడు. సినిమాలో అర్జున్ రెడ్డి బీచ్ అంటే ఉన్న ఇష్టంతో కేరళలో చదువుకుంటాడు. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ ఎంత బాగా నటించారో చెప్పక్కర్లేదు. ఈ క్యారెక్టర్ తను చేస్తున్నాడు అనుకున్నప్పటి నుండే విజయ్ అందులో లీనమైపోయాడు. అలాంటి పాత్రలు అంతకు ముందు వచ్చిన డ్రామాస్, మూవీస్ చూడ్డం చేశాడు. అతి ఎక్కువ వ్యయంతో రూపొందిన బాహుబలి 2 సినిమా లోని కేవలం క్లైమాక్స్ అయిన ఖర్చే ముప్పై కోట్లు. సినిమాలో ప్రభాస్, రాణా ఇద్దరు కలిసి నటించారు అనుకుంటాం కానీ. సినిమా మొత్తం తిప్పికొడితే వాళ్లు ఇద్దరు కలిసి కనిపించే సీన్లు కేవలం రెండంటే రెండే. కావాలంటే చెక్ చేసుకోండి.

varun tej is not the first choice for fidaa movie

బాహుబలి1 రిలీజ్ కి ముందే కేవలం ఒకే ఒక థియేటర్ ప్రసాద్ ఐమాక్స్ లో ప్రీబుకింగ్ ద్వారా వచ్చిన ఆదాయం 12కోట్లు పైమాటే. కాలకేయ మాట్లాడే కిలికి భాషని కేవలం ఈ సినిమా కోసమే రూపొందించారు.748 పదాలు,40 గ్రామర్ రూల్స్ దీనికోసం రాజమౌలి దగ్గరుండి ఈ భాషని రూపొందింపచేశారు. తొంభై శాతం సినిమా షూటింగ్ రామోజి ఫిలిం సిటిలోనే జరిగింది. రాజమౌలి మాటల ప్రకారం వాస్తవానికి ఈ సినిమా కథను శివగామి పాత్ర ఆధారంగా తయారుచేసుకున్నారట విజయేంద్రప్రసాద్. కానీ చివరకు బాహుబలి పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మార్చారట. అయినప్పటికి కూడా శివగామి పాత్రకు మంచి గుర్తింపే వచ్చింది. సబ్ మెరియన్ ఆధారంగా వచ్చిన సినిమాల్లో ఘాజీ మొట్టమొదటి సినిమా. మొదట ఈ సినిమాను షార్ట్ ఫిలింగా తీసి యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని భావించారట ఈ సినిమా దర్శకుడు సంకల్ప్ రెడ్డి.

ప్రొడక్షన్ డిజైనర్ శివరామారావు సబ్ మెరిన్ ను డిజైన్ చేశారట. అది కూడా నటీనటుల హైట్ ఆధారంగా కొన్ని అడుగుల పొడవు అంతే… తెలుగు, హింది భాషల్లో వచ్చిన ఈ సినిమాను తెలుగు నుండి హిందిలోకి డబ్ చేయలేదు. ఏకకాలంలో రెండు భాషల్లో షూటింగ్ చేశారట. ఒకదాని తర్వాత ఒకటిగా. ఫిదా సినిమాని మొదట మహేశ్ బాబు చేయాలనుకున్నారట. కానీ కొన్ని కారణాలరీత్యా మహేశ్ కాదనుకుంటే.. దిల్ రాజు సజెషన్ మేరకు వరుణ్ తేజ్ కి ఈ అవకాశం వచ్చింది. ఫిదా టీం సాయిపల్లవి కోసం ఆరునెలల పాటు ఎదురు చూసారట. తన చదువు ఫినిష్ చేసుకుని వచ్చాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. బాహుబలితో పోలిస్తే అతితక్కువ వ్యయంతో నిర్మితమైన సినిమా ఫిదా.. అతి ఎక్కువ రాబడి వచ్చిన సినిమా కూడా ఫిదానే.. ఒక సినిమాను ఒకసారే చూస్తాం.. అంతగా నచ్చితే రెండోసారి చూస్తాం కానీ తెలంగాణాలో ఈ సినిమాను పదిసార్లు చూసిన ఆడియెన్స్ కూడా ఉన్నారట..

గురు సినిమాలో బాక్సర్ గా నటించన రితికా సింగ్ నిజజీవితంలో కూడా బాక్సరే. ముఫ్పై ఏళ్ల కెరీర్లో వెంకటేశ్ ఫస్ట్ టైం పాట పాడారు గురు సినిమాలో.. ఈ సినిమాలో బాక్సర్స్ గా కనపడిన నటులందరూ నేషనల్ లెవల్ బాక్సర్సే..అంతేకాదు వాళ్లల్లో ఇండియా తరపున పోటి చేసి టైటిల్స్ గెలుచుకున్నవాళ్లు కూడా ఉన్నారు.

Admin

Recent Posts