Cloves : ల‌వంగాల‌ను ఎక్కువ‌గా ఉప‌యోగిస్తున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోండి..!

Cloves : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో ల‌వంగాలు ఒక‌టి. ఘాటైన రుచిని క‌లిగి ఉండి ఈ ల‌వంగాలు వంట‌ల‌కు చ‌క్క‌టి రుచిని తెస్తాయని చెప్ప‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. కేవ‌లం వంట‌ల్లోనే కాకుండా సౌంద‌ర్య సాధ‌నాల్లో, ఔష‌ధాల త‌యారీలో కూడా ఈ ల‌వంగాల‌ను విరివిరిగా ఉప‌యోగిస్తారు. నోటి దుర్వాస‌న ద‌గ్గ‌ర నుండి కోట్లు ఖ‌ర్చు పెట్టిన త‌గ్గ‌ని వ్యాధుల వ‌ర‌కు దీనిని ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. ల‌వంగాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ, యాంటీ బ్యాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు పుష్క‌లంగా ఉంటాయి. ల‌వంగాల్లో కార్బోహైడ్రేట్స్, క్యాల్షియం, పాస్ఫ‌ర‌స్, మాంగ‌నీస్, సోడియం వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. అంటు వ్యాధుల‌ను అడ్డుకునే శ‌క్తి కూడా ఈ ల‌వంగాల్లో అధికంగా ఉంటుంది.

రోజూ ఉద‌యం లేదా రాత్రిప‌డుకునే ముందు 2 ల‌వంగాల‌ను తిని గోరు వెచ్చని నీటిని తాగాలి. వీటిని నేరుగా తిన‌లేని వారు ల‌వంగాల పొడిని గోరు వెచ్చని నీటిలో కూడా క‌లుపుకుని తాగ‌వ‌చ్చు. ల‌వంగాల‌ను ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ మొద‌టి ద‌శ‌లో ఉన్న వారు ఈ ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ బారి నుండి బ‌య‌టప‌డ‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొంద‌రికి ప్ర‌యాణాలు చేసేట‌ప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి. ప్రయాణం చేయ‌డానికి ముందు రెండు ల‌వంగాల‌ను తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల తీసుకున్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. దీంతో ప్ర‌యాణాల్లో వాంతులు, వికారం వంటి స‌మ‌స్య‌లు తతెత్త‌కుండా ఉంటాయి.

if you are taking cloves daily then first know these facts
Cloves

ద‌గ్గు, జ‌లుబు వంటి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు రోజూ రెండు లేదా మూడు ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి ద‌గ్గు, జ‌లుబు, క‌ఫం వంటి వైర‌స్ ఇన్ఫెక్ష‌న్ ల బారి నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో పేరుకుపోయిన మ‌లినాలు, విష ప‌దార్థాలు తొల‌గిపోతాయి. త‌ల‌నొప్పితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు రెండు ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఇలా ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బీపీ, డ‌యాబెటిస్ కూడా నియంత్ర‌ణ‌లో ఉంటుంది. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు, చ‌ర్మ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఆయా స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

శ‌రీరంలో మెటాబాలిజాన్ని పెంచి కొవ్వు క‌రిగేలా చేయ‌డంలో కూడా ఈ ల‌వంగాలు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దీంతో చెడు కొలెస్ట్రాల్ క‌రిగి శ‌రీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల మ‌నం గుండె సంబంధిత స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటాము. కీళ్ల నొప్పుల‌తో బాధ‌ప‌డే వారు ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ల‌వంగాల్లో ఉండే పోష‌కాలు ఎముక‌ల‌ను ధృడంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. ల‌వంగాల్లో ఉండే యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ల‌వంగాలను రోజూ ఆహారంలో తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. గ్యాస్, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఈ ల‌వంగాలు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఈ ల‌వంగాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు.

ల‌వంగాల‌ను తిన‌డం వ‌ల్ల దంతాల‌, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. దంతాలు ధృడంగా మార‌తాయి. నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. పాల‌ల్లో చిటికెడు ల‌వంగాల పొడిని క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల త‌లనొప్పి త‌గ్గుతుంది. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ల‌వంగాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. ల‌వంగాల‌ను చ‌ప్ప‌రిస్తూ ఉంటే మ‌ద్యం తాగాల‌న్న కోరిక కూడా క‌ల‌గ‌కుండా ఉంటుంది. ల‌వంగాల‌ను చంద‌నంతో క‌లిపి పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఈ విధంగా ల‌వంగాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts