Green Tea : గ్రీన్ టీ హెల్త్ కి మంచిదనుకొని తాగుతున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోండి..!

Green Tea : పెరిగిన కాలుష్యం, మారిన జీవన ప్రమాణాల దృష్ట్యా అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. అందులో నుండి ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల బాధ్య‌తతో వ్యవహరిస్తున్నారు అనేకమంది. అందుకే ఒకప్పటి జొన్నె రొట్టెలు, రాగి సంకటి, అంబలి వీటన్నింటికి మళ్లీ డిమాండ్ బాగా పెరిగింది. దాంతో పాటు ఒకప్పుడు టీ, కాఫీల చుట్టూ తిరిగే జనం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటూ గ్రీన్ టీ వైపు మళ్లారు. అంతేకాదు ఎవరు హెల్త్ గురించి ఏ కంప్లైంట్ చేసినా గ్రీన్ టీ ట్రై చేసి చూడు అని ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. కానీ గ్రీన్ టీ మీరు అనుకునేంత బెస్ట్ ఏం కాదు. దాని వలన కూడా నష్టాలున్నాయి. అవేంటో తెలుసుకోండి.

అనీమియా.. అనగా రక్తహీనత. గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన ఐరన్ డెఫిషియన్సీ మూలంగా అనీమియా వచ్చే అవకాశముంది. గ్రీన్ టీలో ఉండే టానిన్స్ బాడీని ఐరన్ కంటెంట్స్ ని అబ్జార్బ్ చేయనివ్వవు. తత్ఫలితంగా మన శరీరంలో ఐరన్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. దీంతో ర‌క్త‌హీన‌త వ‌స్తుంది. అలాగే గ్రీన్ టీ మూలంగా మన హార్ట్ బీట్ రేంజ్ లో ఛేంజెస్ వచ్చే అవకాశాలున్నాయి. హార్ట్ బీట్ పెరిగే ప్రమాదం ఉంది. నార్మల్ హార్ట్ బీట్ చేంజ్ అయితే చాలా కష్టం. గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికి శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. తద్వారా కడుపునొప్పి, కడుపులో మంట లాంటివి కలుగుతాయి.

if you are taking Green Tea excessively you should know this
Green Tea

మన శరీరం 9.9 గ్రాముల గ్రీన్ టీ నే తీసుకునే శక్తి కలిగి ఉంటుంది. దీని పరిమాణం పెరిగితే మన శరీరంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయి. తలనొప్పి వాటిల్లో ఒక భాగం. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ దీని వలన టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశలెక్కువ. దీనికి కారణం దీనిలో ఉండే కాటచిన్స్. గ్రీన్ టీ మూలంగా కళ్లపైన ప్రెజర్ కూడా ఎక్కువ పడే అవకాశముంది. అంతేకాదు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం మూలంగా ఎలర్జీలు వచ్చే అవకాశముంది. ముఖం, నాలుక, గొంతు మరియు పెదాల‌ ప్రాంతాల్లో దురదలా అనిపించొచ్చు. క‌నుక గ్రీన్ టీని అధికంగా తాగ‌రాదు. రోజుకు రెండు క‌ప్పులు మించితే ప్ర‌మాదం. సైడ్ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కాబ‌ట్టి గ్రీన్ టీని మోతాదులోనే తాగాలి.

Share
Editor

Recent Posts