హెల్త్ టిప్స్

Phone Use In Toilet : టాయిలెట్‌కు స్మార్ట్‌ఫోన్‌ను తీసుకెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!

Phone Use In Toilet : శరీరాన్ని శుభ్రం చేసుకునే చర్యల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఒకటి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయి ఆరోగ్యం చేకూరుతుంది. నిత్యం ప్రతి ఒక్కరూ ఈ పని చేయాల్సిందే. లేదంటే అనారోగ్యాల బారిన పడతారు. అయితే నేటి ఆధునిక టెక్ యుగంలో మరుగుదొడ్డికి వెళ్లేవారు తమతోపాటు తమ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్తున్నారు. ఓ వైపు శరీరం నుంచి వ్యర్థాలను బయటికి విడిచిపెట్టి మరోవైపు ఎన్నో వేల బ్యాక్టీరియాలు, వైరస్‌లు స్మార్ట్‌ఫోన్ ద్వారా శరీరంలోకి ప్రవేశించేలా చేసుకుంటున్నారు. కాగా ఇది ఎంతమాత్రం ఆరోగ్యకరమైన విషయం కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

అత్యంత అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాల్లోన్నింటిలో మరుగుదొడ్డి కీలకస్థానంలో ఉంటుంది. ఎన్నో వేల బ్యాక్టీరియాలు, వైరస్‌లు, సూక్ష్మ క్రిములు బాత్‌రూంలో ఉంటాయి. ఇవి స్మార్ట్‌ఫోన్లకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా బహిరంగ టాయిలెట్లలో ఈ క్రిములు ఎక్కువగా ఉంటాయి. డోర్‌పై, డోర్ హ్యాండిల్‌పై, నేలపై, టాయిలెట్ సీట్‌పై ఇలా ఏ ప్రదేశంలోనైనా క్రిములు ఉంటాయి. వాటికి శరీరంలోని ఏ భాగమైనా తాకితే దాంతోపాటు ఆ క్రిములు మన పైకి కూడా వస్తాయి.

if you are taking phone to toilet then beware of this

ఇలా మరుగుదొడ్ల వల్ల వ్యాపించే క్రిములతో డయేరియా, కడుపునొప్పి వంటి వ్యాధులు వస్తాయి. ప్రధానంగా ఇ.కోలి వంటి బ్యాక్టీరియా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి జీర్ణసంబంధ సమస్యలు కూడా తలెత్తుతాయి. అరిజోనా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రతి 10 ఫోన్లలో 9 ఫోన్లు ప్రమాదకర బ్యాక్టీరియాను కలిగి ఉంటున్నాయట. ఈ బ్యాక్టీరియాలో మరుగుదొడ్డికి చెందినవే ఎక్కువగా ఉంటున్నాయట. వీటి శాతం 16గా ఉందట.

అయితే మన శరీరాన్ని, ప్రధానంగా చేతులను శుభ్రంగా కడుక్కుంటాం. కానీ ఫోన్‌ను మాత్రం కడగలేం కదా. కాబట్టి ఇక ముందు మీరు టాయిలెట్‌కు వెళ్తే స్మార్ట్‌ఫోన్‌ను మాత్రం తీసుకెళ్లకండి. ఎందుకంటే మన ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం కదా. లేదంటే గోటితో పోయేది.. గొడ్డలి దాకా వస్తుంది.. జాగ్రత్త..!

Admin

Recent Posts