హెల్త్ టిప్స్

Nerve Weakness : న‌రాల బ‌ల‌హీన‌త ఉందా.. వీటిని తీసుకోండి..!

Nerve Weakness : ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడతారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. మెదడు నుండి శరీరానికి, శరీరం నుండి మెదడుకి అన్ని సంకేతాలు చేరడానికి నరాలు ఎంతో ఉపయోగపడతాయి. నరాల కణాలకు రక్త సరఫరా జరగకపోతే నరాల కణాలు బలహీనంగా మారిపోతాయి. నరాలలో మంట, వణుకు, బలహీనత వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. నరాల్లో సమస్యలు ఎక్కువగా సిగరెట్ తాగే వాళ్ళకి, మందు తాగే వాళ్లలో కనబడుతుంటాయి.

అదే విధంగా విటమిన్ డి, బి6, బి12 లోపం ఉన్నట్లయితే నరాల బలహీనత కలుగుతుంది. నరాలు బలంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా మీరు తెలుసుకోవాలి. కొన్ని ఆహారపదార్దాలని తీసుకుంటే నరాల బలహీనత సమస్య అసలే ఉండదు. తవుడులో విటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. 20 రోజులు పాటు ఈ ఆహారం మీరు తీసుకున్నట్లయితే నరాల బలహీనత తగ్గుతుంది. పుట్టగొడుగుల్లో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. పుట్టగొడుగులని ఎక్కువగా తీసుకుంటే కూడా నరాల బలహీనత సమస్య నుండి బయటపడొచ్చు. నరాలని బలంగా మార్చుకోవచ్చు.

if you have nerve weakness then take these

అదే విధంగా పాలకూరని తీసుకుంటే కూడా మీ నరాలు బలంగా తయారవుతాయి. నరాలని బలంగా మార్చుకోవడానికి మొలకెత్తిన విత్తనాలు, పచ్చి బెండకాయలు కూడా తీసుకో వచ్చు. వీటిని తీసుకుంటే కూడా మీ నరాలు బలంగా మారుతాయి. పొద్దు తిరుగుడు విత్తనాలు, బాదం పప్పు రోజు వారీ ఆహారంలో తీసుకున్నట్లయితే నరాల బలహీనత సమస్య నుండి బయట పడ‌వ‌చ్చు.

చూశారు కదా నరాలు బలంగా మారాలంటే ఎటువంటి ఆహార పదార్థాలని మీరు మీ డైట్ లో చేర్చుకోవాలో. మరి ఇక వీటిని రోజూ తీసుకుని నరాల బలహీనత సమస్య నుండి బయట పడండి. ఆరోగ్యంగా ఉండండి. ఏ బాధ లేకుండా సంతోషంగా జీవించండి.

Admin

Recent Posts