Curd : మీకు ఈ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్నాయా.. అయితే పెరుగును అస‌లు తినరాదు..!

Curd : మ‌న‌లో చాలా మంది పెరుగు అంటే ఎంతో ఇష్టంగా తింటుంటారు. భోజ‌నం చివ‌ర్లో పెరుగు వేసుకుని అన్నంలో క‌లుపుకుని తింటారు. పెరుగుతో తిన‌క‌పోతే చాలా మందికి భోజ‌నం చేసిన ఫీలింగ్ కూడా క‌ల‌గ‌దు. క‌నుక చాలా మంది పెరుగును ఇష్టంగా తింటుంటారు. అయితే ప‌లు ర‌కాల అనారోగ్య స‌మస్య‌లు ఉన్న‌వారు మాత్రం పెరుగును తిన‌రాద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఇక ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు పెరుగును తిన‌రాదో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంద‌రు త‌ర‌చూ ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతుంటారు. అయితే వీరు రాత్రి పూట పెరుగును తిన‌డం మానేయాలి. కేవ‌లం ప‌గ‌లు మాత్ర‌మే తినాలి. లేదంటే శ‌ర‌రీంలో మ్యూక‌స్ మ‌రింత పెరుగుతుంది. దీంతో ఆయా స‌మ‌స్య‌లు ఇంకా ఎక్కువ‌వుతాయి. కాబ‌ట్టి పెరుగును రాత్రి పూట తిన‌రాదు. ఇక కీళ్ల నొప్పులు ఉన్న‌వారు కూడా పెరుగును తిన‌రాదు. ఎందుకంటే పెరుగు తియ్య‌ని ఇంకా పుల్ల‌ని ఆహారాల జాబితాకు చెందుతుంది. దీన్ని తింటే నొప్పులు అధిక‌మ‌వుతాయి. క‌నుక ఇప్ప‌టికే కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి స‌మ‌స్య మ‌రింత పెరుగుతుంది. క‌నుక కీళ్ల నొప్పులు ఉన్న‌వారు కూడా పెరుగును తిన‌రాదు.

if you have these health problems then you should not take curd
Curd

ఇక జీర్ణ‌శ‌క్తి అంత‌గా లేనివారు, అజీర్ణం, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రాత్రి పూట పెరుగును తిన‌రాదు. తింటే ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ‌దు. అలాగే గ్యాస్‌, అసిడిటీ మ‌రింత పెరిగే అవ‌కాశాలు ఉంటాయి. క‌నుక ఈ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రాత్రి పూట పెరుగును తిన‌రాదు. అలాగే పాలు అంటే ఎల‌ర్జీ ఉన్న‌వారు పెరుగును కూడా తిన‌రాదు. దీంతోపాటు ఆస్త‌మా ఉన్న‌వారు కూడా పెరుగును తిన‌డం మానేయాలి. లేదంటే స‌మ‌స్య మ‌రింత ఎక్కువ‌వుతుంది. అయితే ఎవ‌రైనా స‌రే వీలైనంత వ‌ర‌కు పెరుగును రాత్రి పూట కాకుండా ప‌గ‌టిపూటే తినే ప్ర‌య‌త్నం చేయాలి. దీంతో శ్వాస‌కోశ ఇబ్బందులు రావు. అలాగే మ‌ల‌బ‌ద్ద‌కం ఉన్న‌వారు కూడా రాత్రి పూట కాకుండా ప‌గ‌టి పూట పెరుగును తినాలి. దీంతో అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి.

Share
Editor

Recent Posts