Fenugreek Seeds Water : మెంతుల‌ను ఇలా తీసుకుంటే.. షుగ‌ర్ లెవ‌ల్స్ మొత్తం త‌గ్గుతాయి..!

Fenugreek Seeds Water : ప్రస్తుత త‌రుణంలో చాలా మంది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న‌శైలి.. అదుపు త‌ప్పిన ఆహార‌పు అల‌వాట్ల వ‌ల్ల డ‌యాబెటిస్ బారిన ప‌డుతున్నారు. ఇలాంటి వారికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇది చాలా కామ‌న్ అయిపోయింది. యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారు కూడా దీని ప్ర‌భావానికి లోన‌వుతున్నారు. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిందంటే.. అది లైఫ్ లాంగ్ వ్యాధి అని ఫిక్స‌వుతున్నారు. టైప్ 1 అయితే అలా అనుకోవాలి. కానీ టైప్ 2 డ‌యాబెటిస్ అయితే దాన్ని త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను డాక్ట‌ర్లు సూచించిన విధంగా మందుల‌ను వాడ‌డంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. త‌గిన ఆహారాన్ని వేళ‌కు తీసుకోవాలి. త‌గినంత స‌మ‌యం పాటు నిద్రించాలి. ఇలా జాగ్రత్త‌లు పాటిస్తే టైప్ 2 డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.

అయితే డ‌యాబెటిస్ ను త‌గ్గించ‌డంలో మెంతులు అద్భుతంగా ప‌నిచేస్తాయి. వీటిని రోజూ తీసుకోవ‌డం వల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ మొత్తం త‌గ్గుతాయి. దీంతో మ‌ధుమేహం నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అయితే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించేందుకు మెంతుల‌ను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మెంతుల‌ను తిన‌డం వ‌ల్ల చక్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అలాగే జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటివి ఉండ‌వు. దీంతోపాటు కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి.

Fenugreek Seeds Water can reduce blood sugar levels
Fenugreek Seeds Water

ఇక డ‌యాబెటిస్‌ను త‌గ్గించేందుకు రాత్రి పడుకునేటప్పుడు రెండు టీస్పూన్ల‌ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. టైప్-2 మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఇది ఉత్తమమైనది. ఇది కాకుండా మెంతుల‌ను నీటిలో ఉడకబెట్టడం ద్వారా కూడా తీసుకోవచ్చు. మెంతుల కషాయం అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ విధంగా మెంతుల‌ను తీసుకుంటే షుగ‌ర్ దెబ్బ‌కు కంట్రోల్ అవుతుంది. అలాగే ఇత‌ర ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గ‌డంతోపాటు శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కొలెస్ట్రాల్ త‌గ్గి గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. క‌నుక మెంతుల‌ను త‌ప్ప‌క రోజూ తీసుకోవాలి.

Share
Editor

Recent Posts