Sleep : ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకోవాలంటే.. దీన్ని తాగండి..!

Sleep : ఆహారం, నీరు ఎలాగో మ‌న‌కు నిద్ర కూడా చాలా అవ‌స‌రం. ప్ర‌తి మ‌నిషికి రోజుకు క‌నీసం 7 నుండి8 గంట‌ల అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌స్తుత కాలంలో కంటి నిండా నిద్ర పోవాలంటే ఎంతో అదృష్టం ఉండాల‌ని భావించాల్సి వ‌స్తుంది. నిద్ర‌లేమి కార‌ణంగా కూడా మ‌నం ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఎక్కువ దూరం ప్ర‌యాణించే వారు, ఎక్కువ సేపు కంప్యూట‌ర్ ల ముందు కూర్చుని ప‌ని చేసే వారు మ‌రింత స‌మ‌యం నిద్రపోవాలి. కానీ మ‌న‌లో చాలా మంది మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న కార‌ణంగా నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌క ఎంతో ఇబ్బంది ప‌డుతుంటారు. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం నిద్ర‌లేమి స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

మ‌నం నిద్రించే స‌మ‌యం, నిద్ర‌లేచే స‌మ‌యం ఎప్పుడూ ఒక‌టే ఉండేలా చూసుకోవాలి. నిద్రించే ముందు తేలిక‌పాటి ఆహారాన్ని తీసుకోకూడ‌దు. ప‌గ‌టి పూట క‌నుకు మానేయాలి. ప‌డుకునే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగాలి. సాయంత్రం పూట యోగా, వాకింగ్ తో పాటు చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కొన్నిసార్లు నిద్ర‌లేమి వెనుక కార‌ణాలు ఏదైనా స‌మ‌స్య కార‌ణం కావ‌చ్చు. స్థూల‌కాయం, దీర్ఘ‌కాలిక నొప్పులు, హైప‌ర్ యాక్టివ్ వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వ‌చ్చు. మెల‌టోనిన్ స‌హ‌జ‌మైన హార్మోన్. ఇది మ‌నం స‌మ‌యానికి నిద్ర‌పోయేలా, నిద్ర‌లేచేలా చేస్తుంది. ఇవే కాకుండా ఒక‌ చిన్న చిట్కాను ఉప‌యోగించి కూడా మ‌నం నిద్ర‌లేమి స‌మ‌స్య నుండి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం తొక్క తీయ‌ని అర‌టి పండును, నీళ్ల‌ను, దాల్చిన చెక్క పొడిని, షుగ‌ర్ ఫ్రీ చ‌క్కెర‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. ముందుగా అర‌టి పండును తొక్క తీయ‌కుండా శుభ్రంగా క‌డిగి చివ‌ర్ల‌ను తొల‌గించాలి. త‌రువాత దీనిని ముక్క‌లుగా చేసి ప‌క్క‌కు పెట్టుకోవాలి.

if you want good Sleep then drink this daily at night
Sleep

త‌రువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీళ్ల‌ను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో అర‌టి పండు ముక్క‌ల‌ను, దాల్చిన చెక్క పొడిని వేసి మ‌రిగించాలి. నీళ్లు మ‌రిగిన తరువాత స్ట‌వ్ ఆఫ్ చేసి నీటిని వ‌డ‌క‌ట్టుకోవాలి. త‌రువాత దీనిలో త‌గినంత షుగ‌ర్ ఫ్రీ చ‌క్కెర‌ను క‌లిపి గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత తాగాలి. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు చ‌క్క‌టి నిద్ర‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అలాగే 5 గ్రాముల జాజికాయ‌, 5 గ్రాముల జాప‌త్రి, 5 గ్రాముల మ‌రాఠి మొగ్గ‌లు, 3 గ్రాముల ప‌చ్చ క‌ర్పూరం.. వీట‌న్నింటిని తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని రోజూ రాత్రి ప‌డుకునే ముందు గోరు వెచ్చ‌ని పాల‌ల్లో పావు టీ స్పూన్ మోతాదులో క‌లుపుకుని తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మ‌న‌కు నిద్ర‌లేమి స‌మ‌స్య త‌గ్గుతుంది. ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌న ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి చ‌క్క‌టి నిద్ర‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

D

Recent Posts