హెల్త్ టిప్స్

బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోండి..!

ప్రతీరోజు ఉదయం సాయంత్రం ముప్పావుగంట నడక డయాబెటిస్‌ను అదుపులోకి తెస్తుంది. ప్రతి రోజు అల్లంతో చేసిన టీని తాగుతుంటే జీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపులో మంట మొదలైన పొట్టకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజు గోధుమ జావ తాగితే బీపీ ఉన్నవారికి మంచిది. ఫేషియల్‌ ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల ముడతలను సమర్ధంగా నివారించవచ్చు. హాయిగా నవ్వేవాళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగానే కాక అందంగాకూడా కనిపిస్తారు. వార్ధక్యం వీరిదరి చేరదా? అనిపించేలా ఉంటారు. నవ్వడం వల్ల ముఖంలోని కండరాలకు ఎక్సర్‌సైజ్‌ అంది రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మం పటుత్వంతో ఉంటుంది. కాబట్టి ముడతలు పడవు.

పెరిగే పిల్లలకు సోయాబీన్ మంచి పోషణని ఇస్తుంది. దేహదారుఢ్యానికి, పెరుగుదలకు దోహదం చేస్తుంది. శరీరం పెరుగుదలతో పాటు మెదడును వికసింపచేస్తుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లు అనుకున్నదే తడవుగా ఆహారనియమాలు, వ్యాయామాలు మొదలు పెట్టటం జరుగుతుంది. సాధారణంగా ఉండాల్సిన బరువుకంటే అదనంగా ఎన్ని కిలోలు ఉన్నారు? అంటే ఎంత బరువు తగ్గితే సరిపోతుంది? ఎంత సమయం తీసుకోవాలి అన్న విషయంపై స్పష్టత వచ్చాక నియమాలను పాటించటం మొదలు పెట్టాలి. ఇందుకోసం అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవటం మంచిది. బరువు తగ్గాలనుకున్న వాళ్లు రోజువారీ ఆహారంలో కనీసం ఐదుసార్లు పచ్చికూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వాటిలో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ సమృద్ధిగానూ కేలరీలు తక్కువుగా వుంటాయి.

if you want to reduce weight know this

భరించరానంత తలనొప్పి తగ్గాలంటే పది తులసి ఆకులు, పది నల్ల మిరియాలను నూరి అందులో టీ స్పూను తేనె కలిపి రోజుకు మూడు సార్లు తినాలి. బాదం పప్పు, గసగసాలు కలిపి తింటే రక్తం శుద్దియగును. బాగా నమిలి తినాల్సిన ఆహారాన్ని తీసుకునే వారిలో కూడా చర్మం త్వరగా ముడతలు పడకపోవడాన్ని చూస్తుంటాం. ఎక్కువ సేపు నమలడం ద్వారా ముఖంలోని కండరాలు శ్రమిస్తాయి. చర్మపు మెటబాలిజమ్‌ మెరుగవుతుంది. కాబట్టి ముడతలు పడవు. బెల్లం లో మిరియాల పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని నిద్రించే ముందు తీసుకుంటే జలుబు తగ్గుతుంది. బొప్పాయి కాయను కానీ, ఆకుని కానీ మెత్తగా కాటుకలా నూరి ఆ ముద్దని అరికాళ్ళ ఆనెల మీద పెట్టి, కట్టుకడితే అవి మెత్తబడతాయి.

Admin

Recent Posts