నేటి రోజులలో జంటలు ఎదుర్కొనే సమస్యలు సమస్యలుగా వున్నాయనేకంటే, ఎంతో హాస్యాస్పదంగా వుంటున్నాయని చెప్పాలి. వివాహ జీవితంలో జంటల మధ్య వచ్చే తగవులు రాకుండా వుండాలంటే వారు కొన్ని పనులు చేయరాదు. ఈ పనులు చేయకుండా వుంటే, విడాకుల శాతం ప్రపంచంలోనే అధికంగా తగ్గిపోతుంది. కాని ఈ పనులు చేయకుండా వుండటం వారి తరం కాదు. కారణం…వారు చేయటానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. మరి ఆ అలవాటు పడిన పనులు ఏవో పరిశీలించండి. అతడే లేదా ఆమె ముందు మాట్లాడాలి లేదా పిలవాలి అనే తీరు మార్చుకోండి. ఈ రకమైన పట్టుదల కారణంగా మీరు పొందేది తక్కువ. నష్టపోయేది ఎక్కువ. మాట్లాడండి, వెలిబుచ్చండి. పంచుకోండి.
సంబంధం పటిష్టమవాలంటే ఇదే సూత్రం. ఒక్కసారి ఫోన్ చేయండి. ఆనందం ఫోన్ కాల్ దూరంలో వుందని గ్రహించండి. ఒకరితో మరి ఒకరు పోటీ పడకండి. నేడు స్నేహితులుగా వుండాలన్న పేరుతో జంటలు పోటీ పడుతున్నారు. ఇది వారి మధ్య స్పర్ధలకు దారి తీస్తోంది. ఒకరినొకరు సవాలు విసురుకుంటూంటే, సమస్యలని గ్రహించండి. పెరుగుతున్న విడాకులకు పోటీ మనస్తత్వం అనేది గ్రహించండి. సమానంగా కూడా వుండవద్దు. పురుషుడు, మహిళ అన్ని అంశాలలోను సమానం కాదని గ్రహించండి. మీ పరిధులు మీరు తెలిసికొని ప్రవర్తిస్తే సమస్యలుండవని భావించండి. తల్లితండ్రులను నిందించకండి. మీ వివాహ జీవితంలో మీరు ఏర్పరచుకున్న సమస్యలకు తల్లితండ్రులను నిందించకండి. వారిని బలిపశువులు చేయకండి.
మీ పోట్లాటలకు గౌరవనీయులైన మీ మీ తల్లితండ్రులను దూరంగా వుంచి మీ పెంపక విలువలను కాపాడుకోండి. వారంటే కనీసం ఆమాత్రం గౌరవం మీకుండాలని గుర్తించండి. మీ స్నేహితులు చెప్పే అంశాలపై వ్యధ చెందకండి. మీరిరువురూ సన్నిహితంగా వుండాలి, సంభాషించుకోవాలి. కానీ, మీ స్నేహితుల సలహాలు కావాలంటూ వారి వెంటపడి పాకులాడకండి. ఫలితాలకు ఎదురు చూడకండి. అనవసరంగా అధికమైన సందేహాలు ఒకరిపై ఒకరు పడకండి. అతను కోరినట్లు పూర్తిగా మీరుండలేరు. మీరు కోరినట్లు పూర్తిగా అతనుండలేడు. కనుక అధికంగా ఆశించకండి. ఇది గుర్తిస్తే, జంటల వివాదాలు చాలా పరిష్కారమవుతాయి.
క్షణికావేశాలలో ప్రవర్తించకండి. ఛండాలంగా తిట్టేసుకోవడం, దుర్మార్గంగా కొట్టుకోవడం చేసి అంతా అయిపోయిందని భావిస్తారు. వివాహ జీవితంలో కనీసం ఒక వంద పెద్ద పోట్లాటలైనా వుండాలి. కనుక, మరోసారి కలిసి కాఫీ తాగేయండి. విడిపోవాలనే త్వరిత నిర్ణయాలు తీసుకోకండి. సంబంధాల నిర్వహణలో ఈ చిట్కాలు పాటిస్తే విడాకులు ఇవ్వాలనే మీ అభిప్రాయాలు మారి ఎన్నో జంటలు మరోమారు కలసి కాపురాలు చేస్తాయి.