హెల్త్ టిప్స్

Children In Sleep : మీ పిల్ల‌లు రాత్రి నిద్ర‌లో ఉలిక్కిప‌డుతూ ఏడుస్తున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే..!

Children In Sleep : చిన్నారుల పుట్టిన రోజు పండగ వేడుకలలో అలాగే అనేక శుభ కార్యాల్లో పాల్గొన్న పెద్దలకీ, పిల్లలకీ వివిధ రకాల పద్ధతుల్లో దిష్టి తీస్తూ ఉంటారు. పిల్లలూ, పెద్దలూ ఘనవిజయాలు సాధించినప్పడూ, బాగా ప్రశంసలు పొందినప్పుడు అతిగా నీరసించి డీలాపడినప్పుడు దిష్టితీస్తారు. అలాగే పిల్లలకి పసుపూ, సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తూంటారు. బయట జనుల దృష్టిదోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే చిన్న పిల్లవాడు నిద్రలో కలవరింతలకు గురికావడం, నిద్ర నుంచి పదే పదే ఉలిక్కిపడుతూ లేవటం వంటి అవ లక్షణాలు లేకుండా ఉంటాడని నమ్ముతారు.

చిన్న పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చూ అనేక వేడుకల్లో పాల్గొనటం వల్ల చుట్టూ అంతా చేరటంవల్ల చిన్నపిల్లలూ లేదా పెద్దలూ కొంత అస్వస్థతకు గురి అవుతారు. అందుకే వివాహ వేడుకలలో, పుట్టిన రోజువేడుకలలో విధిగా హారతి ఇచ్చి చివరలో ఎర్ర నీళ్ళతో దిష్టి తీస్తారు. ఎర్రరంగు పదేపదే చూడటంవల్ల అనేక రోగాలు సమసిపోతాయి. మనసుకి ప్రశాంతతోపాటు ధైర్య గుణంవస్తుంది. కొందరి చూపులు మంచివి కావనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఆ చెడు చూపు నుంచి దిష్టి రక్షణ ఇస్తుందని విశ్వసిస్తారు. అలాగే కళ్లుప్పును శరీరం చుట్టూ తిప్పి వాటిని మంటల్లో వేయడం కూడా దిష్టి తీయడంలో ఉంది.

if your kids are fearing in sleep then do this

సాధార‌ణంగా ఎవ‌రికైనా స‌రే దిష్టి త‌గిలితే ఉన్న‌ట్లుండి అస్వ‌స్థ‌త‌కు లోన‌వుతారు. వికారంగా, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. ఇలా జ‌రిగితే వెంట‌నే దిష్టి తీయాలి. అలాగే చిన్నారులు రాత్రి పూట నిద్ర‌లో ఉలిక్కిప‌డ‌డం, భ‌య‌ప‌డ‌డం, నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తూ ఏడ‌వ‌డం వంటివి చేస్తుంటారు. ఇవ‌న్నీ దిష్టి ల‌క్ష‌ణాలే. క‌నుక దిష్టి తీస్తే ఇలా వారు ప్ర‌వ‌ర్తించ‌కుండా ఉంటారు. అలాగే అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. క‌నుక చిన్నారుల‌కు దిష్టి అనేది త‌ప్ప‌నిస‌రి. త‌ప్ప‌కుండా రోజూ దిష్టి తీయాల్సి ఉంటుంది.

Admin

Recent Posts