హెల్త్ టిప్స్

మీ పిల్ల‌ల‌కు ఫోన్ల‌ను ఎక్కువ‌గా ఇస్తున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

నేటి కాలం లో ఎక్కువగా పిల్లలు ఫోన్స్ తో బిజీ అయిపోతున్నారు. దీని మూలంగా అతిగా బరువు పెరిగిపోవడం జరుగుతోంది. కానీ అది మంచి అలవాటు కాదు. ప్రతి రోజు క్రమం తప్పకుండా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వ్యాయామాలు చేయడమే మంచిది. వ్యాయామం చేయకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. అధిక బరువు ఉన్న వారిలో ఎక్కువగా గుండె జబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిరకాల క్యాన్సర్లు గుండె జబ్బుల తో ఆకస్మిక మరణాలు సంబవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేయడం జరిగింది.

పిల్లలు సమయానికి నిద్రపోయేలా చూడండి. ప్రతీ రోజు అలా చేస్తే ఈ అలవాటు వలన భవిష్యత్తు లో స్థూలకాయం, ఇతర వ్యాధులు తలెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏడాది కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలని ఎలక్ట్రానిక్ స్క్రీన్స్‌ దగ్గరగా ఉంచకూడదు. అలా చేస్తే రేడియేషన్ ప్రభావం పిల్లల లపై తీవ్రంగా ఉంటుంది.

if your kids are using phones then know this

ఏడాది వయస్సు నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న పిల్లలని మూడు గంటల పాటు శారీరక శ్రమ కలిగేలా ఆటలు ఆడించాలి. ఇలా బయట ఆడిస్తేనే మంచిది. ఫిజికల్‌గా యాక్టివ్‌గా కూడా ఉంటారు. స్క్రీన్స్ కి అలవాటు పడిన పిల్లల లో మానసిక ఎదుగుదల, విషయాలను గ్రహించే శక్తి, చురుకు, ఉత్సాహం తక్కువగా ఉన్నట్టు పరిశోదనలు తెలియ చేస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు బయటనే ఆడించండి… సెల్ ఫోన్స్ కి దూరంగా ఉంచండి.

Admin

Recent Posts