Katora Food : గోంధ్ కటిరా.. దీనినే బాదం బంక, గోధుమ బంక అని కూడా అంటారు. గోంధ్ కటిరా వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేద నిపుణులు సైతం దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవాలని సూచిస్తూ ఉంటారు. గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మలబద్దకం సమస్య తగ్గుతుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత శక్తి లభిస్తుంది. నీరసం, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. అలాగే దీనిని తీసుకోవడం వల్ల మనం సులభంగా బరువు తగ్గవచ్చు. గోంధ్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.
ఇది చాలా సేపటి వరకు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో ఆకలి త్వరగా వేయదు. అలాగే మనం తక్కువ ఆహారాన్ని తీసుకుంటాము. గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే మలినాలు, విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. అంతేకాకుండా గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల చర్మం అందంగా తయారవుతుంది. ముడతలు, మచ్చలు మన దరి చేరకుండా ఉంటాయి. చర్మంపై ఉండే గీతలు కూడా తొలగిపోతాయి. చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా గోంధ్ మనకు దోహదపడుతుంది. దీనిలో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టును ఒత్తుగా పెరిగేలా చేయడంలో సమాయపడతాయి.
గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. తరచూ ఇన్ఫెక్షన్ ల బారిన పడే వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీనిలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉండే నొప్పులను నివారించడంలో గోంధ్ సమర్థవంతంగా పని చేస్తుంది. అదే విధంగా గర్భంతో ఉన్న వారు, బాలింతలు గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల వారు మరింత బలంగా, ఆరోగ్యంగా తయారవుతారు.
మూత్ర సంబంధిత సమస్యలను తగ్గించడంలో, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో, నోటిలో అల్సర్లను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా గోంద్ కటిరా మనకు సహాయపడుతుంది. ఈ కటిరాను నెయ్యిలో వేయించి పొడిగా చేసుకోవాలి. తరువాత ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ ఆవు పాలల్లో కలిపి తీసుకోవాలి. అలాగే జ్యూస్ ల తయారీలో కూడా దీనిని నానబెట్టి వేసుకోవచ్చు. ఈ కటిరాను పొడిగా చేసి లడ్డూల తయారీలో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా గోంధ్ కటిరాను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.