Kooragayala Juices: ఏయే ర‌కాల కూర‌గాయ‌ల జ్యూస్‌ల‌ను రోజూ తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా ?

Kooragayala Juices: మ‌న‌కు అందుబాటులో అనేక ర‌కాల కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు ఉన్నాయి. అవ‌న్నీ మ‌న‌కు పోష‌కాల‌ను, శ‌క్తిని అందించేవే. ఒక్కో ర‌కానికి చెందిన కూర‌గాయ‌, ఆకుకూర‌లో భిన్న‌మైన పోష‌కాలు ఉంటాయి. అందువల్లే న్యూట్రిష‌నిస్టులు నిత్యం 3 ర‌కాల కూర‌గాయ‌ల‌ను అయినా తినాల‌ని, దాంతో మ‌న‌కు సంపూర్ణ పోష‌ణ అందేందుకు అవకాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇక మ‌న‌కు అందుబాటులో ఉన్న ప‌లు కూర‌గాయ‌ల జ్యూస్‌ల‌ను నిత్యం తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

kooragaya juicelu vati vall upayogalu

1. ట‌మాటా జ్యూస్

ట‌మాటా జ్యూస్‌ను నిత్యం తాగడం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. రక్తం బాగా త‌యార‌వుతుంది. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చ‌ర్మం, వెంట్రుక‌లు సంర‌క్షింప‌బ‌డ‌తాయి. ఎముక‌లు దృఢంగా మారుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. జీర్ణ ప్రక్రియ మెరుగు ప‌డుతుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.

2. క్యారెట్ జ్యూస్

కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ త‌గ్గుతుంది. చ‌ర్మం సుర‌క్షితంగా ఉంటుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

3. పాల‌కూర జ్యూస్

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌ళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు పెరుగుతుంది. క్యాన్సర్ క‌ణాలు నాశ‌నం అవుతాయి. హైబీపీ త‌గ్గుతుంది. చ‌ర్మం, వెంట్రుక‌లు సుర‌క్షితంగా ఉంటాయి. ఆర్థ‌రైటిస్ స‌మ‌స్య ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. రక్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

4. క్యాబేజీ జ్యూస్

క్యాబేజీ జ్యూస్‌ను నిత్యం తాగడం వ‌ల్ల శ‌రీరానికి అనేక పోష‌కాలు అందుతాయి. క్యాబేజీని పోష‌కాల గ‌నిగా చెప్ప‌వ‌చ్చు. శ‌రీరంలో ఏర్ప‌డే ఫ్రీ ర్యాడిక‌ల్స్ నాశ‌నం అవుతాయి. క్యాన్స‌ర్‌, గుండె జ‌బ్బులు రావు. శ‌రీరం శుభ్ర‌మ‌వుతుంది. చ‌ర్మం సంర‌క్షించ‌బ‌డుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. లివ‌ర్ ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

5. చిల‌గ‌డ దుంప జ్యూస్

ఎముక‌లు దృఢంగా మారుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది. బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. జీర్ణాశ‌యంలో ఉండే అల్స‌ర్లు త‌గ్గుతాయి. అసిడిటీ స‌మ‌స్య ఉండ‌దు.

6. కొత్తిమీర జ్యూస్

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. క్యాన్స‌ర్ క‌ణాలు నాశ‌నం అవుతాయి. కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. గుండె సంర‌క్షించ‌బ‌డుతుంది. యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు ఉంటాయి క‌నుక ఇన్‌ఫెక్ష‌న్లు రావు. వ్యాధులు త‌గ్గుతాయి.

7. బీట్ రూట్ జ్యూస్

ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. శ‌క్తి పెరుగుతుంది. కండ‌రాలు దృఢంగా మారుతాయి. బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి.

Share
Admin

Recent Posts