హెల్త్ టిప్స్

Lemon Oil : లెమ‌న్ ఆయిల్ గురించి తెలుసా.. ఎన్నో లాభాల‌ను అందిస్తుంది..!

Lemon Oil : నిమ్మ నూనె చాలా మంచిది. నిమ్మ నూనె ఆరోగ్యానికి ఎన్నో లాభాలని కలిగిస్తుంది. చాలా సమస్యల నుండి నిమ్మనూనె మనల్ని దూరంగా ఉంచుతుంది. నిమ్మ నూనెను నిమ్మకాయల ద్వారా తయారుచేస్తారు. శరీరాన్ని ప్రశాంతంగా నిమ్మ నూనె ఉంచుతుంది. నిమ్మ నూనె రిఫ్రెష్ సువాసనను కలిగి ఉంటుంది. సుమారుగా 1000 నిమ్మకాయలతో ఈ నూనె చేస్తే ఒక పౌండు నిమ్మ నూనె వస్తుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలని, అనేక సౌందర్య ప్రయోజనాలను నిమ్మ నూనె అందిస్తుంది.

నిమ్మ నూనె చుండ్రు, చర్మ రుగ్మతలు, ఉబకాయం వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. నిద్రలేమి వంటి బాధల నుండి కూడా దూరంగా ఉంచుతుంది. యాంటీ ఫంగల్, క్రిమినాసిక, రుమాటిక్ లక్షణాలు నిమ్మ నూనెలో ఉంటాయి. అద్భుతమైన ప్రయోజనాలను ఇది అందిస్తుంది. నిమ్మ నూనె ఆందోళనని దూరం చేస్తుంది. ఏకాగ్రతని మెరుగుపరచడానికి కూడా నిమ్మ నూనె బాగా ఉపయోగపడుతుంది. నిమ్మ నూనెతో రోగనిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు.

lemon oil many wonderful health benefits

నిమ్మ నూనెలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ని తొలగించడానికి కూడా ఈ నూనె సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా నిమ్మ నూనె పెంచుతుంది. నిమ్మ నూనె వలన ఆస్తమా కూడా పోతుంది. ఆస్తమా వంటి శ్వాసకోస రుగ్మతలని నిమ్మ నూనె నివారిస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు నిమ్మ నూనెని పీల్చడం వలన చక్కటి ఉపశమనం లభిస్తుంది. కడుపునొప్పి బాధ నుండి కూడా నిమ్మనూనె మనల్ని బయటపడేస్తుంది.

అజీర్తి, మలబద్ధకం వంటి బాధలు ఉండవు. నిమ్మ నూనె జుట్టుకి కూడా ఎంతో మేలు చేస్తుంది. జుట్టుని బాగా మెరిసేట్టు నిమ్మ నూనె చేస్తుంది. జుట్టుకు బలాన్ని కూడా ఇస్తుంది. బరువు తగ్గడానికి కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. జ్వరంగా ఉన్నప్పుడు దీనిని ఉపయోగించడం వలన జ్వరం తగ్గుతుంది. అలానే, నిమ్మ నూనె మానసిక సమస్యలను దూరం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇలా అనేక సమస్యలను నిమ్మ నూనెతో తొలగించుకోవచ్చు.

Admin

Recent Posts