Lunch For Diabetes Patients : షుగ‌ర్ ఉన్న‌వారు మ‌ధ్యాహ్నం లంచ్‌లో వీటిని తినండి.. షుగ‌ర్ త‌గ్గుతుంది..!

Lunch For Diabetes Patients : షుగ‌ర్ వ్యాధితో నేటి త‌రుణంలో అనేక మంది ఎన్నో ర‌కాల బాధ‌లు ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. అలాగే ఆహార విష‌యంలో కూడా అనేక నియ‌మాల‌ను పాటించాలి. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా చూసుకోవాలి. చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా చూసుకోవాలంటే ఆహార విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు పాటించాలి. అదే స‌మ‌యంలో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందేలా చూసుకోవాలి. మ‌నం తీసుకునే ఆహారం చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంతో పాటు శ‌రీరానికి మేలు చేసేదై ఉండాలి.

చాలా మంది షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతూ ఉంటారు. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు ఒక చ‌క్క‌టి డైట్ ను పాటించ‌డం వ‌ల్ల షుగ‌ర్ అదుపులో ఉండ‌డంతో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు కూడా అందుతాయి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు తెల్ల‌గా ఉండే ప‌దార్థాలు అన‌గా పంచ‌దార‌, పాలిష్ ప‌ట్టిన బియ్యం, ధాన్యాలు, మైదాపిండి, ర‌వ్వ‌లు, బ్రెడ్ వంటి వాటిని తీసుకోకూడ‌దు. ఇవి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను వెంట‌నే పెంచుతాయి. పాలిష్ పట్ట‌ని ధాన్యాల‌ను వాటితో చేసే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. అలాగే మ‌ధ్యాహ్న స‌మ‌యంలో తెల్ల అన్నానికి బ‌దులుగా చ‌పాతీల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. లేదంటే బ్రౌన్ రైస్, చిరు ధాన్యాల‌తో వండిన అన్నాన్ని, క్వినోవాతో వండిన అన్నాన్ని తీసుకోవాలి. అలాగే ప్రోటీన్ ఎక్కువ‌గా ఉండే ప‌ప్పుల‌ను తీసుకోవాలి. మ‌న శ‌రీరానికి ప్రోటీన్ కూడా చాలా అవ‌స‌రం.

Lunch For Diabetes Patients take daily to control sugar levels
Lunch For Diabetes Patients

కందిపప్పు, పెస‌ర‌ప‌ప్పు, రాజ్మా, కాబూలీ చ‌నా వంటి వాటితో ప‌ప్పు కూర‌ల‌ను వండుకుని త‌గిన మోతాదులో తీసుకోవాలి. అలాగే బంగాళాదుంప‌ల‌ను తీసుకోవ‌డం, వాటితో త‌యారు చేసే ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం త‌గ్గించాలి. త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే కూర‌గాయ‌ల‌తో కూర‌ల‌ను వండుకుని తినాలి. అదే విధంగా త‌క్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ తో పాటు ఫైబ‌ర్ ఉండే వాటితో స‌లాడ్ ను త‌యారు చేసి తీసుకోవాలి. ఫైబ‌ర్ ఉండే కూర‌గాయ‌ల‌తో చేసే స‌లాడ్ ను తీసుకోవ‌డం వ‌ల్ల అవి జీర్ణం అవ్వ‌డానికి స‌మ‌యం ఎక్కువ‌గా ప‌డుతుంది. క‌నుక ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా అదుపులో ఉంటాయి. అలాగే షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు దాదాపు అన్ని ర‌కాల పండ్ల‌ను తీసుకోవ‌చ్చు.

పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాలు ల‌భించ‌డంతో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అలాగే మొల‌కెత్తిన గింజ‌ల‌ను తీసుకోవాలి. ఇవి శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను అందించ‌డంతో పాటు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను కూడా అదుపులో ఉంచుతాయి. అలాగే వీటిని సాధ్య‌మైనంత వ‌ర‌కు ప‌చ్చిగానే తీసుకోవాలి. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఈ విధమైన ఆహారాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉండ‌డంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏ విధ‌మైన ఆహారాన్ని తీసుకున్నప్ప‌టికి త‌క్కువ మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలని అప్పుడే షుగ‌ర్ వ్యాధి అదుపులో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

D

Recent Posts