అరటిపండు… దాని వల్ల మనకు కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు తెలుసు కదా. ఏంటీ… మళ్లీ అవి చెబుతారా..? అంటే… కాదు. మరేంటీ విషయం… అంటే… ఏమీలేదండీ.. అరటి పండు తొక్క గురించి. అవును, ఏముందీ ఎవరైనా దాన్ని తీసే అరటి పండు తింటారు కదా. ఇక దాని గురించి తెలుసుకోవాల్సింది ఏముంటుందీ… అంటే అవును, ఉంది. నిజంగా అరటి పండు తొక్క ఆరోగ్య ప్రదాయని. ఒక రకంగా చెప్పాలంటే అరటి పండు కన్నా ఇంకా తొక్కే మనకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఆ తొక్కను తినడం వల్ల కలిగే లాభాలనే ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటీ… తొక్కను తింటారా..? అని ఆశ్చర్యపోకండి, నిజంగానే తింటారు. ఇది మేం చెప్పడం లేదు, సైంటిస్టులు ప్రయోగాలు చేసి దీన్ని రుజువు చేశారు కూడా. ఈ క్రమంలోనే అరటి పండు తొక్క వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు వరుసగా 3 రోజుల పాటు రోజుకు రెండు అరటి పండు తొక్కలను తినాలి. దీంతో వాటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో సెరటోనిన్ స్థాయిలను 15 శాతం వరకు పెంచుతాయి. ఇలా సెరటోనిన్ పెరిగితే డిప్రెషన్ తగ్గుతుంది. మూడ్ బాగుంటుంది. మానసిక సమస్యలతో సతమతమయ్యేవారు అరటి పండు తొక్కలను రెగ్యులర్‌గా తింటే మంచి ఫలితం ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ తైవాన్‌కు చెందిన సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. ట్రిప్టోఫాన్ అనే రసాయనం అరటి పండు తొక్కలో ఉంటుంది. అందువల్ల తొక్కను తింటే ఆ రసాయనం మన శరీరంలోకి చేరుతుంది. అప్పుడు నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి పండు తొక్కలను తింటుంటే ప్రయోజనం ఉంటుంది.
అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు. ఓ పరిశోధక బృందం దీన్ని నిరూపించింది కూడా. వరుసగా కొన్ని రోజుల పాటు కొంత మంది రోజూ అరటి పండు తొక్కలను తిన్నారు. దీంతో వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు. అరటి పండు తొక్కలో ఉండే ఫైబర్ అధిక బరువును ఇట్టే తగ్గిస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు క్రమంగా కరుగుతుంది. అరటి పండు తొక్క మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
అరటి పండు తొక్కను రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. అరటి పండు తొక్కను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. అరటి పండు తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది దృష్టి సమస్యలను పోగొడుతుంది. రేచీకటి, శుక్లాలు రావు. దెబ్బలు, గాయాలు, పుండ్లు, దురదలు, పురుగులు, కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది. అరటి పండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి. అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు. లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీంతో పైన చెప్పిన అన్ని లాభాలు కలుగుతాయి.