హెల్త్ టిప్స్

బ్లాక్ కాఫీ తాగితే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా ? వైద్యులేమంటున్నారు ?

కాఫీ ప్రియుల్లో చాలా మంది బ్లాక్ కాఫీని తాగుతుంటారు. దాని రుచికి కొంద‌రు ఫిదా అవుతారు. అయితే బ్లాక్ కాఫీని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని వైద్యులు అంటున్నారు. వాటిల్లో ఒక‌టి బ‌రువు త‌గ్గ‌డం. బ్లాక్ కాఫీని నిత్యం తాగితే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చా ? అంటే.. అవును.. త‌గ్గ‌వచ్చ‌ని డైటిషియ‌న్లు కూడా చెబుతున్నారు.

బ్లాక్ కాఫీలో కెఫీన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఆక‌లిని త‌గ్గిస్తుంది. ఆక‌లిని త‌గ్గించే స‌హ‌జ‌సిద్ధమైన ప‌దార్థంగా కెఫీన్ ప‌నిచేస్తుంది. దీంతోపాటు శ‌రీర మెటబాలిజం పెరుగుతుంది. శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. అంటే శ‌క్తి త్వ‌ర‌గా ఖ‌ర్చ‌వుతుంద‌న్న‌మాట‌. దీని వ‌ల్ల క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

many wonderful health benefits of black coffee

ఇక బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బ‌రువు త‌గ్గించేందుకు స‌హాయ ప‌డుతుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో గ్లూకోజ్ ఉత్ప‌త్తి నెమ్మ‌దిస్తుంది. కొత్త కొవ్వు క‌ణాలు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. దీంతో శ‌రీరం కొవ్వును శ‌క్తి కోసం ఉప‌యోగించుకుంటుంది. ఫ‌లితంగా కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు.

ఇలా బ్లాక్ కాఫీని నిత్యం తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని వ‌ల్ల లాభం ఉన్న‌ప్ప‌టికీ నిత్యం 1 లేదా 2 క‌ప్పుల బ్లాక్ కాఫీనే తాగాల‌ని, అంత‌కు మించితే నెగెటివ్ ప్ర‌భావం ప‌డుతుంద‌ని వైద్యులు అంటున్నారు. అందువ‌ల్ల బ్లాక్ కాఫీని నిత్యం ప‌రిమితంగా తాగ‌డంతోపాటు నిత్యం వ్యాయామం చేయ‌డం, పోషకాహారం తీసుకోవ‌డం చేస్తే.. అధిక బ‌రువు ఇంకా త్వ‌ర‌గా త‌గ్గుతారు.

Admin

Recent Posts